ఒక్క సీటు కోసం ముగ్గురు టీడీపీ నాయ‌కులు ఫైటింగ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-09 16:10:21

ఒక్క సీటు కోసం ముగ్గురు టీడీపీ నాయ‌కులు ఫైటింగ్

2019 ఎన్నిక‌లకు ఇంకా ప‌ది నెలలు గుడువు ఉన్న క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల్లో ప్ర‌త్య‌క్షంగా లేక‌, ప‌రోక్షంగా సీట్ల కోసం ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఫిరాయింపు మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి టీడీపీ నాయ‌కుడు రామ‌సుబ్బారెడ్డి సీట్ల పంచాయితీకి పూర్తి ప‌రిష్కారం దొర‌క‌క‌ముందే మ‌రో పంచాయితీ వెలుగులోకి వ‌చ్చింది.  
 
రాజ‌ధాని ప్రాంతం అయిన బెజ‌వాడ ఎంపీ సీటు త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నాయ‌కులు పోటీ చేసేందుకు పోటీ ప‌డుతున్నారు. ఇందులో ఎమ్మెల్యే ఉండ‌టం విశేషంగా మూరుతోంది. తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే గా భాధ్య‌త‌ల‌ను స్వీకరిస్తున్నా గ‌ద్దె రామ్మోహ‌న్ రావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెజ‌వాడ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గ‌ద్దె ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో పార్టీ పరంగా ప్ర‌జా నాయ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ఆయ‌న ఇప్పుడు రాష్ట్రంలో చ‌క్రం తిప్ప‌కుండా పార్ల‌మెంట్ స్థానానికి పోటీ చేయ‌డం ఏంట‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు. అయితే ఇందుకు బ‌ల‌మైన‌ కార‌ణం ఉంద‌ని తెలుస్తోంది. గ‌ద్దె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా కూడా త‌న‌కు పోటీగా విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు పావులు క‌దుపుతున్నారు. దీంతో అభివృద్ది ప‌నుల్లో కాస్త క‌రువు క‌నిపించ‌డంతో ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా లాభం లేద‌ని గ్రహించి ఎంపీ సీటుకు గ‌ద్దె స్కెచ్ వేశారు.
 
ఇక మ‌రోవైపు టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున విజ‌య‌వాడ‌లో మ‌ళ్లీ ఎంపీగా పోటీ చేయాల‌ని పావులు క‌దుపుతున్నారు. నాని రాజ‌కీయంగానే కాకుండా బెడ‌జ‌వాడ‌లో పేరుగాంచిన వ్యాపారవేత్త‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక వైపు రాజ‌కీయాలు మ‌రో వైపు వ్యాపారం రెండింటిని హ్యాండిల్ చేయ‌డం కుద‌ర‌ద‌ని భావించి రాజ‌కీయాల‌కు దూర‌మ‌వ్వాల‌ని గ‌తంలో ఆయ‌న భివించారు. కానీ టీడీపీ నాయ‌కులు సర్ది చెప్ప‌డంతో రాజ‌కీయాల‌ను క‌ష్ట‌మైనా అలాగే నెగ్గుకొస్తున్నారు. 
 
నిజానికి ముక్కు సూటితనం కారణంగా కొన్ని అంశాల్లో వివాదాస్పదమైన అభివృద్ధి కార్యక్రమాల పరంగా ప్రజలకు అందుబాటులో ఉండటంలోనూ నాని ముందంజలో ఉన్నారు. అంతేకాదు ఎంపీ నిధుల క్రింద త‌న జిల్లాల్లో అనేక అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేసి మంచి నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా నాని ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు.
 
ఇక మ‌రోవైపు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు లోకేశ్ భార్య‌, బాల‌కృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున బెజ‌వాడ‌లో ఎంపీగా పోటీ చేయిస్తే త‌మ ఫ్యామిలీ నుంచి పార్ల‌మెంట్ కు ప్రాతినిధ్యం వ‌హించిన‌ట్లు ఉంటుంద‌ని భావించి ఆమెను పోటీ చేయించాల‌ని చూస్తున్నారట‌. ఆ జిల్లా నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓవ‌రాల్ గా ఒక్క సీటు కోసం ముగ్గురు ఫైట్ చేయ‌నున్నారని తెలుస్తోంది. ఇక ఈ ముగ్గురిలో చంద్ర‌బాబు ఎవ‌రిని ఫైన‌ల్ చేస్తారు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మ‌రుతోంది. చూద్దాం ఏం జ‌రుగుతుందో.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.