బుట్టాకు షాక్.. సో నెక్ట్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-26 18:36:15

బుట్టాకు షాక్.. సో నెక్ట్స్

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున అత్య‌ధిక మెజారిటీతో గెలిచి అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి సుమారు 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. టీడీపీలోకి ఫిరాయించిన త‌ర్వాత ఒక సంవ‌త్స‌రం పాటు సాఫీగానే సైకిల్లో కాలం గ‌డిపారు.
 
ఇక ఇప్పుడు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ప‌డుతున్న తురుణంలో టికెట్ ల‌ స‌మ‌స్య పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది ఫిరాయింపుల‌కు. త‌మ‌కు టీడీపీ త‌ర‌పున అధిష్టానం టికెట్ కేటాయిస్తుందో లేదో అన్న సందేహాలు ఇప్పుడు ఫిరాయింపు నాయ‌కుల్లో పెద్ద స‌మ‌స్యగా మారుతోంది. అయితే ఈ క్ర‌మంలో కొంత మంది ఫిరాయింపులు మాత్రం జ‌గ‌న్ హామీ ఇస్తే తిరిగి వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నామ‌ని చెబుతున్నారు.
 
కానీ ఫిరాయింపుల‌ విష‌యంలో మాత్రం జ‌గ‌న్ చాలా సీరియ‌స్ గా ఉన్నారు. ఎట్టి ప‌రిస్థితులో వారిని వైసీపీలోకి తిరిగి ఆహ్వానించేది లేద‌ని గ‌ట్టి నిర్ణ‌యం తీసుకున్నారు.ఇక ఆయ‌న నిర్ణయంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు త‌మ త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ‌కు సంబంధించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఇక ఇప్పుడు క‌ర్నూల్ ఎంపీ బుట్టా రేణుక ప‌రిస్థితి కూడా అలాగే మారింది. 
 
గ‌తంలో బుట్టా రేణుక వైసీపీలో ఉన్న‌ప్పుడు అడుగు వేస్తే ఇసుక వేసినంత ప్ర‌జా మ‌ద్ద‌తు ఉండేది కానీ ప్ర‌స్తుతం ఆమె టీడీపీలోకి ఫిరాయించ‌డంతో నూటికి ఇర‌వై శాతం కూడా ప్ర‌జా మ‌ద్ద‌తు లేద‌ని తెలుస్తోంది. దీంతో పాటు టీడీపీ నేత‌ల నుంచి కూడా ఆమెకు ఇలాంటి మ‌ద్ద‌తులు త‌లెత్తుతున్నాయి.తాజాగా ఎంపీ నిధుల కింద మంజూరైన మినీ వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి బుట్టా రేణుక ఎమ్మిగనూరుకు వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి ఒక్క టీడీపీ నేత కూడా హాజరు కాకపోవడంతో షాకవ్వడం ఆమె వంతుఅయింది. 
 
ఇక ఇదే విష‌యంపై రాజ‌కీయ విశ్లేష‌కులు తీవ్రంగా చ‌ర్చించుకుంటున్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర వ‌స్తున్న త‌రుణంలో ప్ర‌తీ జిల్లాలో ఇద్ద‌రు టీడీపీ ఇంచార్జ్ లు ఉండ‌డంతో వారిలో ఒక‌రిని మెల్ల‌గా దూరం చేస్తూ వ‌స్తున్నార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మొత్తానికి ఫిరాయింపుల ప‌రిస్థితి రాష్ట్రంలో అల్ల‌క‌ల్లోలంగా మారింద‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.