అనంత‌ టీడీపీలో ఆగ‌ని వ‌ర్గ‌పోరు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-10-06 03:45:30

అనంత‌ టీడీపీలో ఆగ‌ని వ‌ర్గ‌పోరు

2014 సార్వ‌త్రిక ఎన్నికల్లో అనంత‌పురం జిల్లాలో టీడీపీకి గాలి వీచింది. ఈ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాల‌కు గాను టీడీపీ 12 సీట్ల‌ను కైవ‌సం చేసుకోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవ‌లం రెండు స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయింది. జిల్లాలోని ఉర‌వ‌కొండ, క‌దిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ గెలిచినా  ఊహించని ప‌రినామాల నేప‌థ్యంలో క‌దిరి ఎమ్మెల్యే చాంద్ బాష అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సమ‌క్షంలో సైకిల్ ఎక్కారు. ఇక ఆయ‌న సైకిల్ ఎక్క‌డంతో ప్ర‌స్తుతం జిల్లాలో వైసీపీకి ఉన్న‌ది ఒక్క ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే స్థానం మాత్ర‌మే. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత అనంత‌పురం జిల్లా టీడీపీలో స‌మీక‌ర‌ణాలు మారాయి. 
 
ఇదే జిల్లానుంచి ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దురు ఎమ్మెల్యేలకు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. అయితే క్యాబినెట్ లో వీరిద్ద‌రు ఎవ‌రికి వారే య‌మునాతీరే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో సంస్థ‌గ‌తంగా పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డేందుకు ఈ ఇద్ద‌రు మంత్రులు చేస్తున్న‌ది ఏమీ లేద‌నే అభిప్రాయం అధినాయ‌క‌త్వంలో కూడా ఉంది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో జేసీ బ్ర‌ద‌ర్స్ టీడీపీలో చేరిక‌తో అనంత‌పురం టీడీపీలో గ్రూపుల గోడ‌వ ముదిరి పాకాన‌ప‌డ్డ‌ట్లు అయింది. నేత‌లు ఆదిప‌త్య పోరాటంతో పార్టీ శ్రేనుల‌ను గంద‌ర‌గోళంలో పాడేస్తుంది. అసెంబ్లీ ఎన్నిక‌లుకు ముందు టీడీపీలో చేరిన జేసీ బ్ర‌ద‌ర్స్ పార్టీలో త‌మ‌దైన ముద్ర‌సాధించుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేశారు.
 
దీనికితోడు ఎమ్మెల్సీ ప‌య్యావుల‌కేశ‌వ‌కు జేసీ బ్ర‌ద‌ర్స్ అండ‌గా ఉంద‌టంతో ఎక్క‌డిక‌క్క‌డే పార్టీ విభేదాల‌మ‌ధ్య సిరో భారంగా మారుతున్నాయి. మంత్రి ప‌రిటాల సునిత ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే సూర్య‌నారాయ‌ణ‌ల మ‌ధ్య చాలా కాలంగా ఆధిప‌త్య‌పోరు కొన‌సాగుతోంది. ఇటు అనంత‌పురం ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి జేసీ బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య పొంత‌న కుద‌ర‌కుంది. ఇక జిల్లా పార్టీ అధ్య‌క్షుడుగా ఉన్న పెనుకొండ ఎమ్మెల్యే పార్థ‌సార‌ధికి ఎంపీ నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌తో విభేదాలు ఉన్నాయి. గ‌డిచిన ఎన్నిక‌ల్లో కిష్టప్ప‌ త‌న‌కు స‌హ‌క‌రించ‌లేద‌న్న అనుమానాలు ఇప్ప‌టికి పార్థసార‌ధిలో ఉన్నాయి. దీంతో వీరంద‌రి మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతున్నాయి. మొత్తంమ్మీద ఈ జిల్లా టీడీపీలో వ‌ర్గ‌పోరు 2019 ఎన్నిక‌ల్లో కూడా ఇదే త‌ర‌హాలోనే కొన‌సాగుతాయ‌ని స్థానికులు భావిస్తున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.