త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే - టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-08-23 12:47:45

త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే - టీడీపీ

ఎప్పుడు నాయ‌కుల మ‌ధ్య అంత‌ర్గ‌త విభేదాలు, నేత‌ల మ‌ధ్య వివాదాల‌తో స‌త‌మ‌త‌వుతున్న అధికార తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త‌గా మ‌రో స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. ఇప్ప‌టికే పార్టీలో సీట్ల‌కోసం పార్టీనేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు జ‌రుగుతుంటే ఇది చాల‌ద‌న్న‌ట్లు ఒకే సీటుకోసం ఒకే కుటుంబ స‌భ్యులు పోటా పోటీ ప‌డుతున్నారు.
 
ఈ క్ర‌మంలో పార్టీ త‌ర‌పున సీటు సాధించేందుకు ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నట్లు స‌మాచారం. అయితే సీటు కోసం త‌మ‌తో పోటీ ప‌డుతున్న‌ది తోటి కుటుంబ స‌భ్యులు అయినా త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే అన్న‌ సామెత‌లాగ ప‌లు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో ఇలానే త‌యారు అవుతోంది. 
 
ఈ క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు రాజ‌కీయం-రాజ‌కీయ‌మే అంటున్నారు. తాము పోటీ చెయ్యాల‌నుకుంటున్న సీటు కోసం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గేది లేదంటున్నారు టీడీపీ నాయ‌కులు. విజ‌య‌న‌గ‌రం జిల్లా గ‌జ‌ప‌తి న‌గ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా కే అప్ప‌ల నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌నే మళ్లీ టీడీపీ త‌ర‌పున పోటీ చేయ్యాల‌ని భావిస్తున్నారు. 
 
కానీ అదే గ‌జ‌ప‌తి న‌గ‌రం స్థానానికి ఎమ్మెల్యే అప్ప‌ల నాయుడు అన్న కొండ‌ల‌రావు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో సీటు త‌న‌దంటే త‌న‌ద‌ని ధీమాను వ్య‌క్తం చేస్తున్నట్లు స‌మాచారం. గ‌జ‌ప‌తి న‌గ‌రం సీటు అప్ప‌ల నాయుడు కుటుంబంలో చిచ్చు రేపిన‌ట్లే అని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు మాజీ ఎంపీ కొండ‌ప‌ల్లి అప్ప‌ల‌నాయుడు కుమారులు. 
 
ఇక ఇదే క్ర‌మంలో మాజీ మంత్రి ముద్దుకృష్ణ‌మ నాయుడు మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న కుమారులు భాను జ‌గ‌ధీష్ లు న‌గ‌రి అసెంబ్లీ స్థానాన్ని ఇప్ప‌టి నుంచే రాజ‌కీయాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వీరిద్దరు ఎవ‌రికి వారు త‌మ వ‌ర్గాన్ని పెంచి పోషించుకునే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత వీరిద్ద‌రు ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ ప‌డ్డారు.
 
ఇక చివ‌రికి ఈ పంచాయితీ సిఎం చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు చేరినా అక్క‌డ కూడా ఇద్ద‌రి మ‌ధ్య స‌యోద్య కుద‌ర‌క‌పోవ‌డంతో గాలి భార్య స‌ర‌స్వ‌తికి ఎమ్మెల్సీ ఇచ్చి మ‌ధ్య మార్గంగా అప్ప‌టికి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. అయితే కొంత‌కాలం నిశ‌బ్దంగా ఉన్న అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రు ఇప్పుడు న‌గ‌రి సీటు కోసం ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్న‌ట్లు, సీటు నాదంటే నాద‌ని అనుచ‌రుల ద‌గ్గ‌ర చెప్పుకుంటున్నార‌ట‌. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.