జ‌గ‌న్ స‌మ‌క్షంలో భారీ చేరిక‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-06 14:54:42

జ‌గ‌న్ స‌మ‌క్షంలో భారీ చేరిక‌లు

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సంక‌ల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. అధికార బలంతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ రెండు నాలుక‌లు ధోర‌ణిని బ‌య‌టపెడుతూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక ఆయ‌న ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలకు టీడీపీ నాయ‌కులు ఎంతో ఆక‌ర్షితులై జ‌గ‌న్ స‌మ‌క్షంలో  వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడి అవుతున్నారు. అయితే ఇప్ప‌టికే టీడీపీకి చెందిన కీల‌క నాయ‌కులు వైసీపీ కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా తూర్పు గోదావ‌రి ద్రాక్షారామనికి చెందిన వారు సుమారు 200 మంది వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు.
 
ఆ త‌ర్వాత వారు మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న‌లో త‌మ గ్రామంలో ఒక్క అభివృద్ది కార్య‌క్ర‌మం కూడా జ‌రుగలేద‌ని, కేవ‌లం టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మాత్ర‌మే ఫ‌లితాలు ఇస్తార‌ని వేరే వారికి ఇవ్వ‌ర‌ని వారు వాపోతున్నారు. ఇక ఈ సిస్ట‌మ్ న‌చ్చ‌కే తాము వైసీపీలో  చేరామ‌ని స్ప‌ష్టం చేశారు. 2019 లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్యంత్రిని చేసేందుకు త‌మవంతు కృషి చేస్తామ‌ని తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.