జ‌గ‌న్ స‌మ‌క్షంలో 500 మంది టీడీపీ నాయ‌కులు వైసీపీ తీర్థం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan
Updated:  2018-10-06 10:42:36

జ‌గ‌న్ స‌మ‌క్షంలో 500 మంది టీడీపీ నాయ‌కులు వైసీపీ తీర్థం

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను, కోస్తాలోని ఆరు జిల్లాల‌ను అలాగే ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ జిల్లాను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో దిగ్విజ‌యంగా కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్రలో జ‌గ‌న్ ప్రజా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వర‌త్నాల‌ను  ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.
 
ఇక జ‌గ‌న్ ప్ర‌క‌టిస్తున్నన‌వ‌రత్నాల‌కు ఆర్షితులై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొంద‌రు కీల‌క నాయ‌కులు వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు. అయితే ఇదే క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు సుమారు 500 మంది తాజాగా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. పార్టీ తీర్థం తీసుకున్న త‌ర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అన్ని విధాలుగా క‌ష్టప‌డ్డామ‌ని తీరా పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ త‌మ‌ను అధికారులు ప‌ప్పులో క‌రివేపాకులా తీసిప‌డేశార‌ని వారు మండిప‌డ్డారు. 
 
త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ నాయ‌కులకు రుచి చూపిస్తామ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వ‌స్తే రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌ళ్లీ రాజ‌న్న పాల‌న‌ను చూస్తార‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.