జ‌గ‌న్ స‌మ‌క్షంలో భారీ చేరిక‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-30 17:32:37

జ‌గ‌న్ స‌మ‌క్షంలో భారీ చేరిక‌లు

నేను చేసేదే చెబుతాను.. చెయ్య‌లేనిది చేస్తాన‌ని చెప్పి ప్ర‌జ‌ల‌ను మోసం చెయ్య‌ను, అబ‌ద్దం చెప్పి నేను బాద‌ప‌డ‌టం, ప్ర‌జ‌లు మోస‌పోవ‌టం నాకు ఇష్టం లేదు. 2019లో తాను ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌ రాజ‌కీయాల్లో విస్వ‌సనీయ‌త తీసుకు వ‌స్తాన‌ని ఏ నాయ‌కుడు అయితే ఇచ్చిన హామీల‌ను అమ‌లు చెయ్య‌లేక‌తాడో అక్క‌డి నుంచి అటే పార్టీకి రాజీనామా చేయించే ప‌రిస్థితిని తీసుకువ‌స్తాన‌ని చెప్తున్నారు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇక ఆయ‌న న‌మ్మ‌కంతో చెబుతున్నరు కాబ‌ట్టి ఖ‌చ్చితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ఓటు వెయ్యాల‌ని కొంత మది ప్ర‌జ‌లు బ‌హిరంగంగానే చెబుతున్నారు.
 
ఇక మ‌రికొంద‌రు అయితే మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో మాత్ర‌మే నిజాయితీ రాజ‌కీయాలు చూశామ‌ని కానీ కొద్ది కాలంగా అలాంటి ప‌రిస్థితి క‌నించ‌లేద‌ని అంటున్నారు. ఇప్పుడు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ స్పీచ్ విన్న త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయాల్లో విస్వ‌త‌నీయ వ‌స్తుంద‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. అందుకోస‌మే తాము వైసీపీలో చేరుతున్నామ‌ని అంటున్నారు. 
 
ప్ర‌స్తుతం టీడీపీ కంచుకోట తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని రాజుపాలెం, చంద్రమాంపల్లి మీదు సాగుతోంది. ఇక ఈ పాద‌యాత్ర‌లో జ‌గ్గంపేట నియోజ‌వ‌ర్గానికి చెందిన టీడీపీ కీల‌క నాయ‌కులు ఈ రోజు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. వైసీపీ తీర్థం తీసుకున్న త‌ర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసేందుకు త‌మవంతు కృషి చేస్తామ‌ని వారు స్పష్టం చ‌శారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే మళ్లీ రాజ‌న్న పాల‌న చూస్తామ‌ని అంటున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.