వైసీపీలోకి భారీ చేరిక‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp and tdp
Updated:  2018-05-21 18:16:23

వైసీపీలోకి భారీ చేరిక‌లు

ప్రతిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ సంక‌ల్ప‌యాత్రలో భాగంగా జ‌గ‌న్ కొద్దిరోజుల క్రితం 2000 వేల కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సంఘీబావంగా సెగ్మెంట్ వారిగా పాద‌యాత్ర చేస్తున్నారు.ఆ పాద‌యాత్ర‌కు వైసీపీ అభిమానుల‌తో పాటు టీడీపీ కార్య‌క‌ర్త‌లు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.
 
ఇక తాజ‌గా టీడీపీ నాయ‌కుల కంచుకోట అనంత‌పురం జిల్లాలో సంఘీభావ యాత్ర‌ను వైసీపీ నాయ‌కులు చేప‌ట్టారు. ఈ పాద‌యాత్ర‌లో భాగంగా సుమారు 450 మంది కుటుంబాలు వైసీపీ నాయ‌కులు హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త నదీం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గ సమన్వయకర్తలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో వారు వైసీపీ తీర్థం తీసుకున్నారు.
 
పార్టీలో చేరిన త‌ర్వాత వారు మాట్లాడుతూ, చంద్ర‌బాబు మొద‌టిసారిగా ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి తాము టీడీపీకి ఓటు వేస్తూనే ఉన్నామ‌ని కానీ త‌మ జిల్లాకు ఎటువంటి అభివృద్ది జ‌ర‌గ‌లేద‌ని మండిప‌డుతున్నారు. అయితే త‌న‌కు ఇష్ట‌మైన జిల్లా అనంత‌పురం జిల్లా అని మీడియా స‌మావేశంలో  ప్ర‌చారం చేయ‌డం చాలా సిగ్గుచేటుగా ఉంద‌ని వారు ఆరోపించారు.
 
ఇక చంద్ర‌బాబు అబ‌ద్ద‌పు మాట‌ల‌కు చెక్ పెట్టే రోజులు ద‌గ్గ‌రలో ఉన్నాయ‌ని రానున్న రోజుల్లో  ఫ్యాను గాలికి సైకిల్‌ కొట్టుకుపోవడం ఖాయం అని అంటున్నారు. 2019 సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని, ఏపీలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం అని వారు ధీమా వ్య‌క్తం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.