బాబుకి షాక్.. జ‌గ‌న్ స‌మ‌క్షంలో టీడీపీ నాయ‌కులు వైసీపీ తీర్థం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-01 15:14:36

బాబుకి షాక్.. జ‌గ‌న్ స‌మ‌క్షంలో టీడీపీ నాయ‌కులు వైసీపీ తీర్థం

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు హయాంలో ప్ర‌తీ రోజు ప్ర‌జ‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నామ‌ని ప్ర‌తిపక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో ప్ర‌జ‌లు త‌మ గోడును వివ‌రిస్తున్నారు. వారి స‌మస్య‌ల‌ను ఓపిక‌తో విన్న జ‌గ‌న్ 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ప్ర‌తీ ఒక్కరి స‌మ‌స్య‌ల‌ను తీర్చుతాన‌ని వారికి కొండంత భ‌రోసా ఇస్తూ పాద‌యాత్ర‌లో ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
226వ రోజు పాద‌యాత్ర‌లో భాగంగా పిఠాపురంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్రహాన్నిఆవిష్క‌రించిన జ‌గ‌న్.. అక్క‌డి నుంచి  గొల్ల‌పురోలు మీదుగా తాటిప‌ర్తి క్రాస్ వ‌ర‌కు పాద‌యాత్ర సాగ‌నుంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గన్ ప్ర‌తీ ఒక్క‌రిని అప్యాయంగా ప‌లుక‌రిస్తూ, వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 
 
ఇక మ‌రోవైపు వైసీపీలో చేరిక‌లు కూడా విప‌రీతంగా జ‌రుగుతున్నాయి. నాలుగు సంవ‌త్స‌రాల టీడీపీ మోస‌పూరిత‌మైన పాల‌న‌లో విసుగు చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు. ఏఎంసీ మాజీ చైర్మ‌న్ బాబ్జీ, శ్రీ సంస్థానం చైర్మ‌న్ రామ‌కృష్ణ‌తో పాటు ఆరుగురు టీడీపీ కీల‌క నేత‌లు కూడా వైసీపీ తీర్థం తీసుకున్నారు. వైసీపీ తీర్థం తీసుకున్న త‌ర్వాత వారు మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హయంలో తాము పూర్తి గా మోస‌పోయామ‌ని వారు ఆరోపించారు. అంతేకాదు టీడీపీ నాయ‌కుడు అయిన త‌మ‌కు కూడా రుణ‌మాఫి కాలేద‌ని వారు మండిప‌డ్డారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.