భూ వివాదంలో టీడీపీ నాయ‌కులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-30 18:10:33

భూ వివాదంలో టీడీపీ నాయ‌కులు

2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చ‌ల‌విడిగా అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని నిత్యం ప్ర‌తిప‌క్ష వైసీపీ నాయ‌కులు మీడియా ముందు విమ‌ర్శిస్తూనే ఉన్నా కానీ, పార్టీ అధినేత  చంద్ర‌బాబు మాత్రం టీడీపీ నాయ‌కులపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.ఇక ఈ త‌తంగం చూస్తున్న పోలీస్ అధికారులు కూడా వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా ఈ గొడ‌వ‌కు మాకు ఎటువంటి సంబంధం లేదు అన్న‌ట్లు వ్య‌వ‌హరిస్తున్నారు. దీంతో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆట‌ల‌కు రాష్ట్రంలో అడ్డు అదుపు లేకుండా పోతోంది.
 
ఇక ఇలాంటి వ్య‌వ‌హారంలో ఎమ్మెల్యే బోండా ఉమ ముందంజ‌లో ఉన్నారు. ఈయ‌న గ‌తంలో కూడా ఓ స్వ‌తంత్ర స‌మ‌ర‌యోధుడి భూమిని అభివృద్ది పేరు చెప్పి బోండా ఉమా అక్రమంగా క‌బ్జా చేశారు. అయితే భూమికి సంబంధించిన ఇద్దరు మహిళలు పెనమలూరు డెవెలప్ మెంట్‌ పేరుతో తమ‌ 86 సెంట్ల భూమిని ఎమ్మెల్యే బోండా ఉమా ఆక్రమించారని  జాయింట్‌  కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో వారు జాయింట్ క‌లెక్ట‌ర్ కు  ఫిర్యాదు చేయ‌డంతో ఈ త‌తంగం మొత్తం బ‌య‌టప‌డింది.
 
ఇక ఈ ఘ‌ట‌న రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌రువ‌క ముందే ఎమ్మెల్యే బోండా ఉమా, ఎంపీ  మాగంటి బాబు క‌లిసి తాజాగా మ‌రో భూ వివాదంలో చిక్కుకున్నారు. విజయవాడలోని సుబ్బరాయ నగర్‌ వెంచర్ లో స్థలం ఇప్పిస్తామని చెప్పి నందిగామకు చెందిన సుబ్రమణ్యం అనే వ్య‌క్తి ద‌గ్గ‌ర నుంచి రూ. 35లక్షలు టీడీపీ ఎంపీ మాగంటి బాబు తీసుకున్నారు. తీరా రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో భూమిలేదు ఏం లేద‌ని చేతులేత్తేశార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. 
 
ఇక మరోవైపు రంగంలోకి దిగిన కొందరు వ్యక్తులు బోండా ఉమ, మాగంటి బాబుతో మాట్లాడి సెటిల్ చేసుకోవాలని సుబ్రమణ్యంను బెదిరించారు. అయితే వారి బెదిరింపుల‌కు సుబ్ర‌మ‌ణ్యం బ‌య‌ప‌డకుండా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసు అయినా పోలీసులు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ద‌ర్యాప్తు చేసి నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటారా లేక త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని సైలెంట్ గా ఉంటారా అన్న విష‌యం ఆస‌క్తిగా మార‌నుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.