తెలుగు త‌మ్ముళ్ల తిరుగుబాటు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 10:37:12

తెలుగు త‌మ్ముళ్ల తిరుగుబాటు

విజ‌య‌వాడ తెలుగుదేశం పార్టీలో మ‌రో  అంత‌ర్గ‌త పోరు తెర‌పైకి వ‌చ్చింది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ పార్టీలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం పార్టీ పెద్ద‌ల‌కు  తల నొప్పిగా మారింది. అందులోనూ విజ‌య‌వాడ లాంటి ప్ర‌ధాన న‌గ‌రంలో క‌ల‌హాలు ఏర్పడ‌టంతో పార్టీ సీనియ‌ర్ నేత‌లు రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. 
 
బెజ‌వాడ కార్పోరేష‌న్ లో మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్ పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కొంద‌రు కార్పోరేట‌ర్లు తిరుగుబాటు జెండా ఎగుర‌వేశారు. గ‌త కొంత కాలంగా మేయ‌ర్ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని,  చుల‌క‌న‌గా చూడ‌ట‌మే కాకుండా , అవ‌మాన‌క‌రంగా మాట్లాడుతున్నార‌ని కార్పోరేట‌ర్లు  పార్ట పెద్ద‌ల  దృష్టికి తీసుకువ‌చ్చారు. 
 
త‌మ‌పైన మాత్ర‌మే కాకుండా  అధికారుల ప‌ట్ల కూడా ఇదే విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, ఇలాగే కొన‌సాగితే  విజ‌య‌వాడ‌లోని మూడు నియోజ‌వ‌ర్గాల్లో పార్టీపై వ్య‌తిరేక‌త ఏర్ప‌డే అవ‌కాశం ఉన్నందున మేయ‌ర్ పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ విజ‌య‌వాడ అర్బ‌న్ అధ్య‌క్షుడు బుద్దా వెంక‌న్నకు  లేఖ  రాశారు తెలుగు త‌మ్ముళ్లు .
 
tdp party
తూర్పు ఎమ్మెల్యే  గద్దె రామ్మోహన్ విషయంలో జరిగిన గొడవ కారణంగానే కొందరు కార్పోరేటర్లు ఇలా తిరుబాటు చేస్తున్నారని మేయ‌ర్ శ్రీకాంత్ వ‌ర్గం కార్పోరేట‌ర్లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.