రాంమాధ‌వ్ తో టీడీపీ నేత‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-16 13:07:10

రాంమాధ‌వ్ తో టీడీపీ నేత‌లు

బీజేపీ నేత‌ల‌తో వైసీపీ నాయ‌కులు స‌మావేశాలు భేటీలు అవుతున్నారు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే..ఇక తాజాగా ఇప్పుడు పీఏసీ చైర్మ‌న్ బుగ్గ‌న బీజేపీ నేత రాంమాధ‌వ్ ను క‌లిశారు అని వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే..ఇప్ప‌టికే  తెలుగుదేశం నాయ‌కులు ఇదే అంశాన్ని ప్ర‌స్తావిస్తూ చెబుతున్నారు.
 
ముఖ్యంగా ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ నాయకుల‌తో వైసీపీ లాలూచి ఒప్పందం చేసుకుంది అని విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో, ఇటు వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే... తాము బీజేపీ నేత‌ల‌ను క‌ల‌వ‌లేద‌ని వారితో ర‌హ‌స్య ఒప్పందాలు చేసుకోలేదు అని చెబుతున్నారు.
 
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తనను కలవలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్  మీడియా ముఖంగా తెలిపారు..టీడీపీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు రాంమాధవ్‌ను కలిసిన అంశాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా ‘ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు నన్ను కలిసిన మాట నిజమే అపి తెలియ‌చేశారు. అయితే వారు మా మాతృమూర్తి నెల మాసికం కార్యక్రమానికి వచ్చారు. నన్ను పరామర్శించారు అని వెల్లడించారు... ఎమ్మెల్యే బుగ్గన కలిసినట్టు వచ్చిన వార్తలను ప్రస్తావించగా అందులో నిజం లేదు. అని పేర్కొన్నారు.
 
మొత్తానికి ఆయ‌నే వాస్త‌వాలు తెలియ‌చేయ‌డంతో, ఇప్పుడు రాజ‌కీయంగా ఇది వైసీపీకి మ‌రింత మైన‌స్ చేయాల‌ని అనుకుంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు అనేది తేలిపోయింది..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.