బాబును ప‌ప్పులో క‌రివేపాకులా తీసిపారేస్తున్న టీడీపీ నేత‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-09-18 02:59:45

బాబును ప‌ప్పులో క‌రివేపాకులా తీసిపారేస్తున్న టీడీపీ నేత‌లు

ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు లెక్క చేయ‌కున్నారా.....! అంటే అవున‌నే స‌మాధానం నిపిస్తోంది ప్ర‌స్తుతం. కొద్దిరోజుల క్రితం జ‌రిగిన ఏసీ అసెంబ్లీ స‌మావేశాలు కేవ‌లం మొక్కుబ‌డిగా సాగాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. స‌భ‌కు మెజార్టీ స‌భ్యులు ప్ర‌తీ రోజు డుమ్మా కొట్టి పార్టీని అష్ట క‌ష్టాల్లో పెట్టార‌నే విమ‌ర్శ‌లు టీడీపీ నాయ‌కుల‌పై ఉన్నాయి.
 
స‌మావేశాల‌కు ఖ‌చ్చితంగా హాజ‌రు కావాల‌ని ప్ర‌తీ రోజు ఉద‌యాన్నే టెలీకాన్ఫ్ రెన్స్ పెట్టినా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం పెద‌విమెద‌వి పెదిపిన‌ట్లు తెలుస్తోంది. స‌భ‌కు స‌భ్యులు త‌క్కువ‌గా ఉంటే స‌హించేది లేద‌ని చంద్రబాబు నాయుడు మీడియాకు లీకులు ఇస్తున్నా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు డోంట్ కేర్ అనే నినాదాన్ని ఫాలో అవుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.
 
అంతేకాదు వీరంద‌రు స‌భ‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డంతో విప్స్ న‌లుగురు కూడా  విఫ‌లం అయ్యార‌ని చంద్ర‌బాబు నాయుడును చివాట్లు పెట్టార‌నే గుస‌గుస‌లు విన‌పిస్తున్నాయి. స‌భ‌లో త‌న‌ను త‌న కుమారుడిని పొగిడే స‌మ‌యంలో స‌భ్యులు స‌క్ర‌మంగా లేకపోవ‌డం ముఖ్య‌మంత్రికి రుచించ‌డం లేద‌ట‌. శాస‌న మండ‌లిలో చిన‌బాబు యువ‌నేస్తంపై ప‌ర్పాయింన్స్ ను ప్ర‌జంటేష‌న్ ఇచ్చేస‌మ‌యంలో స‌భ్య‌లు నామ‌మాత్రంగా ఉండ‌టం పెద‌బాబుకు ఆగ్ర‌హం తెప్పించిద‌ట‌. 
 
ఇక పై స‌భ్యులు త‌క్కువ‌గా ఉంటే తాను స‌హించేదిలేద‌ని, ప్ర‌తీ గంట‌కు స‌భ్యుల హాజ‌రు తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించార‌ట‌. జీరో అవ‌ర్ లో ముఖ్య‌మైన స‌మ‌స్య‌ల‌ను స‌భ్యులు లేవ‌నెత్తి ప్ర‌శ్న‌ల‌కు  సంబంధిత మంత్రులు లేక‌పోవ‌డంతో అన్ని ప్ర‌శ్నల‌ను స‌మాచార శాఖా మంత్రి కాలువ శ్రీనివాసులే రాసుకోవాల్సిన ప‌రిస్థితి  ఏర్ప‌డింద‌ట‌. అతేకాదు స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు లేక‌పోవ‌డంతో స‌భ్యులు స‌మావేశాల‌పై పెద్ద‌గా ఆస‌క్తి చూప‌టంలేద‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ప్ర‌తిపక్షం స‌భ‌లో ఉన్న‌ప్పుడు స‌మావేశాలు, వాడీ వేడిగా జ‌రిగేవ‌ని వారు గుర్తు చేస్తున్నార‌ట‌. అయితే ప్ర‌స్తుతం చంద్ర‌బాబు, లోకేశ్ బ‌జ‌న మాత్ర‌మే చేయాల్సి వ‌స్తుంద‌ని తెలుగుద‌మ్ముళ్లు ఆవేద‌న ప‌డుతున్నార‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.