క్యాష్ కొట్టు సీటు ప‌ట్టు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-08-27 14:59:28

క్యాష్ కొట్టు సీటు ప‌ట్టు

రాక్ష‌సుడు ఎలా ఉంటాడ‌ని చిన్న పిల్ల‌లు త‌ల్లి దండ్రులను అడిగితే మ‌న ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫోటోను చూపించండి. అప్పుడు రాక్ష‌సుడు మాన‌వ రూపంలో వ‌చ్చాడ‌ని అంద‌రికీ అర్థం అవుతోంది. తాను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సైరాబాద్ ట‌వ‌ర్ లో నియ‌మించిన‌ ఒక మొక్క‌ను అంటూ ర‌జ‌ని డైలాగ్ చెప్పి ఆయ‌న‌ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేయ్యాల‌నే ఉద్దేశంతో ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. 
 
అయితే ప్ర‌స్తుతం వైసీపీ అధినేతకు మాత్రం ఆమెలో ఒక జ‌న‌నేత క‌నిపించాడు. అందుకే గ‌తంలో ఆయ‌న‌ను వైఎస్ ను నోటికి వ‌చ్చిన‌ట్లు తిట్టినా కూడా స‌ద‌రు మ‌హిళా నాయ‌కురాలు ర‌జ‌నినే చిల‌క‌లూరు పేటకు వైసీపీ ఇంచార్జ్ గాఆమె పార్టీలో చేరిన మ‌రుక్ష‌ణ‌మే జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అయితే ఆమె పార్టీలో చేరిక వెనుక పెద్ద త‌తంగం న‌డిచిన‌ట్లు తెలుస్తోంది. 
 
మొద‌టి నుంచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ప్పు దారి ప‌ట్టిస్తు వ‌స్తున్న నాయ‌కులు ఆయ‌న‌ను ఈసారి కూడా త‌ప్పుదారిలో బుట్ట‌లో ప‌డేసింది. తొలినుంచి పార్టీని న‌మ్ముకుని నిజ‌మైన వైసీపీ సేవ‌కుడిగా ప‌నిచేస్తున్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ను ప‌క్క‌కు తోసేశారు. ర‌జ‌నిని ఇంచార్జ్ గా నియ‌మించ‌డానికి ఆఫ్ లైన్ లో వైసీపీనేత అని చెబుతున్న కార‌ణం ర‌జిని ఆర్థికంగా  అభివృద్ది చెందిన మ‌హిళ అట. అందుకే  2019 ఎన్నిక‌ల్లో మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావును డీ కోట్టాలంటే ఆమెనే స‌రైన అభ్య‌ర్థి అని భావించార‌ట‌. 
 
గ‌త‌లంలో పుల్లారావును జంటిల్ మెన్ గా ప్ర‌శంశ‌లు కురిపించిన ఆ మ‌హిళే చిల‌క‌లూరి పేట వైసీపీ గెల‌పుకు దిక్కు అయితే అంత‌కంటే దుర‌దృష్టం ఏముంటుంది. వైఎస్సార్ కుటుంబాన్ని న‌మ్ముకున్న వారికి అన్యాయం జ‌రుగ‌దు అన్న‌ది ఇప్ప‌టివ‌ర‌కు  ఉన్న‌భావ‌న‌. కానీ ఏక ప‌క్షంగా అవ‌మానక‌రంగా మ‌ర్రి రాజేశేఖ‌ర్ ను తొల‌గించ‌డంతో మిగిలిన నేత‌ల‌కు అధిష్టానం ఏం సందేశం ఇవ్వాల‌ను కుంటుందో చూడాలి. గ‌తంలో కూడా ఇలానే కొంద‌రి నాయ‌కులు మార్చారు.
 
కానీ ఆస‌మ‌యంలో బాదిత నాయ‌కుల‌కు క‌నీస హామీల‌ను ఇస్తూ వ‌చ్చారు జ‌గ‌న్.  కానీ మ‌రీ రాజ‌శేఖ‌ర్ విష‌యంలో మాత్రం మాన‌వ‌త్వం లేకుండా అధిష్టానం వ్య‌వ‌హ‌రించింద‌న్న‌ది స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. ఒక వేల వ‌చ్చే ఎన్నిక‌ల‌కు డ‌బ్బే ప్ర‌ధానం అయితే పార్టీ నుంచి స‌గం మంది త‌ప్పుకోవాల్సిందే. ఎందుకంటే స‌గ‌టున ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో వంద‌ల కోట్లు సంపాదించుకున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు సంఖ్య చాల‌నే ఉంది మ‌రి వారంద‌రికి పోటీగా రాజిని లాంటి వారిని ఇత‌ర దేశాల్లో సాఫ్ట్ వేర్ దిగ్గ‌జం అయిన‌టువంటి తెలుగు వారిని దిగుమ‌తి చేసుకుంటారా ! లేక జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైఎస్ ను గ‌తంలో నోటికి వ‌చ్చిన‌ట్లు తిట్టినా స‌రే వారు క్యాష్ తో కొడితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున చోటు ఇస్తారా అనేది ప్ర‌శ్న‌గా మారింది. 
 
రాష్ట్రంలో ప్రత్తిపాటి పుల్లారావు లాంటి వారు ప్ర‌తీ జిల్లాకు ముగ్గురు ఉన్నారు. అయితే అక్క‌డ కూడా న‌మ్మిన వారికి ప‌క్క‌కు తోసేస్తారా అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేవ‌లం డ‌బ్బుతోనే పార్టీ గెలుస్తుంద‌నే నైతిక‌త వ‌స్తే పార్టీలో ఉన్న ఎతిక్స్ దెబ్బ‌తింటాయ‌ని పార్టీ అనుచ‌రులు భావిస్తున్నారు. జ‌గ‌న్ పార్టీని క్యాష్ తో కొడితే చాలు టికెట్ ఖాయం అనే భావ‌ణ వ‌స్తే ఇక నిజాయితీగా ప‌నిచేసి ఏ స‌మ‌న్వ‌య క‌ర్త కూడా స‌మ‌ర్థ వంతంగా ప‌ని చెయ్య‌లేరు.
 
వైఎస్ రాజ‌శేర్ రెడ్డి హాయం నుంచి కుటుంబాన్ని న‌మ్ముకుని వ‌స్తున్న‌సీనియ‌ర్ నాయ‌కులు గతంలో కోట్ల రూపాల‌య‌ను త‌మ అస్తుల‌ను అమ్మి పార్టీని భ‌లోపేతం చేసి నాయ‌కులు జ‌గ‌న్ ఎలాంటి స్ప‌ష్ట‌త ఇస్తారో వేచి చూడాలి.  గ‌తంలో వైఎస్ కుంటుంబం దృత‌రాష్టులని విమ‌ర్శ‌లు చేసిన వారికి వైఎస్ జ‌గ‌న్ అంద‌ళం ఎక్కించిన త‌ర్వాత ఇక నిత్వం మీడియా ముందు విశ్వ‌నీయ‌త అని చెప్పే వారికి అధిష్టానం ఎలాంటి స‌మాధానం ఇవ్వబోతుంది.

షేర్ :

Comments

3 Comment

  1. Miru cmts api andarni kalisikattuga poniyyataniki arpatlu cheyndi.... dayachesi...

    Chinthalapudi lo same Sean.repat iendhi

    Chinthalapudi lo same Sean.repat iendhi

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.