టీడీపీ నేత‌లు ఫిర్యాదుకు సిద్దం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-17 12:16:15

టీడీపీ నేత‌లు ఫిర్యాదుకు సిద్దం

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ విభేదాల‌ను స‌ద్దుమ‌ణిగించ‌డంలో పార్టీ అధిష్టానం నిర్ల‌క్ష్యం వ‌హించింది. దీని వ‌ల్ల  అంత‌ర్గ‌త పోరుతో నాయ‌కులు స‌త‌మ‌తం అవుతున్నారు. ఒకే వేదిక పై ఆసీనులు కావాల్సిన నాయ‌కులు విభేదాల వ‌ల్ల స‌మావేశాల‌కు సైతం హ‌జ‌రుకాకుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు టీడీపీ నాయ‌కులు.
 
ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జ‌వ‌హ‌ర్ మ‌ద్య‌పానంలో భాగ‌మైన బీర్‌ను కూల్‌డ్రింక్ అంటు వివాదానికి గురైయ్యారు. అనుచ‌రుల‌తో దాడి చేయిస్తున్నారంటూ జిల్లా ఇంఛార్జ్ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుకు సొంత కార్య‌క‌ర్త‌లు ఫిర్యాదు చేసిన‌ విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మంత్రి జ‌వ‌హార్ పై పార్టీ కార్య‌క‌ర్త‌లు కొత్త ఫిర్యాదు చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. 
 
పశ్చిమ‌గోదావ‌రి జిల్లాలో మంత్రి గారి లిక్క‌ర్ ట్యాక్స్‌ను ఊహించ‌నంత స్థాయిలో పెంచుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా బాటిల్ MRP ధ‌ర పై 10రూపాయులు అధిక ధ‌ర‌కు అమ్ముతున్నార‌ని అంటున్నారు. మంత్రి ఆదేశాల మేర‌కే ఇలాంటి విక్ర‌యాలు జ‌రుపుతున్నార‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌లు వేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.. లిక్క‌ర్ కంపెనీతో లాలూచి కావ‌డం వ‌ల్ల‌ వ‌చ్చిన ఆదాయంలో స‌గం వాటా మంత్రికి వెళుతుంద‌ని కార్య‌క‌ర్త‌లు అంటున్నారు.  మంత్రి స‌హ‌కారం ఉన్న అనుచ‌రులు ఇసుక  ర‌వాణాతో పాటు మినుముల కొనుగోళ్ల‌లోనూ అక్ర‌మాలు చేసిన‌ట్లు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు కార్య‌క‌ర్త‌లు  సిద్ద‌మ‌య్యారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.