టీడీపీ కీల‌క నేత‌లు వైసీపీ తీర్థం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-24 18:20:39

టీడీపీ కీల‌క నేత‌లు వైసీపీ తీర్థం

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన‌ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్రకు అడుగ‌డుగునా వేలాది మంది ప్ర‌జ‌లు హ‌జ‌రై జ‌న‌నేత‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు... ప్ర‌స్తుతం ఈ సంక‌ల్ప‌యాత్ర నంద‌మూరి ఫ్యామిలీ కంచుకోట కృష్ణా జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది..ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార టీడీపీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ... వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూ జ‌న‌సందోహంతో ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా ఫ్యాన్ గాలికి త‌ట్టుకోలేక సైకిల్ ముందు టైర్ అలాగే వెనుక టైర్లు పంక్ట‌ర్  కావ‌డంతో టీడీపీ నాయ‌కులు క‌ల‌త చెందుతున్నారు... ఈ నేప‌థ్యంలో సైకిల్ వ‌దిలి ఫ్యాన్ చెంత‌కు చేరేందుకు ప‌లువురు కీల‌క నాయ‌కులు ఆస‌క్తి చూపుతున్నార‌ని విస్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలుపుతున్నారు... దీంతో పాటు 2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావ‌డానికి కీల‌క బాధ్య‌తు వ‌హించిన వ్య‌క్తులు త‌మ ఫ్యూచర్ రాజ‌కీయాల నిమిత్తం వైసీపీలోకి చేరుతున్నట్లుతెలుస్తోంది.
 
అలాగే రాజ‌కీయ విశ్లేష‌కులు తెలిపిన విధంగా కృష్ణా జిల్లాకు చెందిన కాపు-కమ్మ-రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముఖ్య నేతలు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపుతున్నారు...ఈ సామాజికవ‌ర్గాలకు చెందిన నాయ‌కులు పార్టీ ఫిరాయించ‌డానికి ముఖ్య కార‌ణం?  పార్టీ ఫిరాయింపులు వ‌ర్గ‌పోరు ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. అలాగే పార్టీలో ఫిరాయింపు నాయ‌కుల‌కు పెద్ద పీట వేయ‌డం కూడా ఓ కార‌ణంగా తెలుస్తోంది.
 
దీంతో పాటు 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు కాపుల‌కు  తాము అధికారంలోకి వ‌స్తే త‌ప్ప‌కుండా రిజర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని చెప్పి వారి ఓట్ల‌న్ని తనకు అనుకూలంగా మ‌ల‌చుకుని  అధికారాన్ని ద‌క్కించుకున్నారు... కాపు అండ‌తో ఆధికార‌పీటాన్ని ద‌క్కించుకున్న చంద్ర‌బాబు సుమారు నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డిచినా వాటిప్ర‌స్తావ‌న‌ తీసుకురాలేదు... దీంతో  వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు త‌గిన బుద్ది చెప్పేందుకు  వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌మ‌క్షంలో ప‌లువురు సీనియ‌ర్లు వైసీపీ తీర్దం పుచ్చుకునేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.