నన్ను డ‌బ్బులు అడుగుతావా నీ.. అ...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-02 12:55:50

నన్ను డ‌బ్బులు అడుగుతావా నీ.. అ...

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు విచ్చల విడిగా అక్ర‌మాలుకు పాల్ప‌డుతున్నారు. తాము అధికారంలో ఉన్నాము కాబ్బటి ఏమి చేసిన త‌మ‌దే న‌డుస్తుంది. మేమే చెప్పినట్టు చెయ్యాలి, వినాలి అంటూ రాష్ట్రంలో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రిని బెదిరిస్తున్నారు తెలుగు త‌మ్ముళ్లు. ఇక వారి ఆగ‌డాల‌కు కొంత‌మంది పోలీస్ అధికారులు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మొన్న‌టికి మొన్న మాజీ ప్ర‌ధాని దేవెగౌడ, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి తిరుప‌తికి రాక సంద‌ర్భంగా ప్రోటోకాల్ ఏర్పాటు చేయ‌లేదంటూ టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు జాయింట్ క‌లెక్ట‌ర్ ను నీ అంతు చూస్తాన‌ని బెదిరించిన సంగ‌తి తెలిసిందే.
 
ఈ ఘటన రాష్ట్ర‌ ప్ర‌జ‌లు మ‌రువ‌క ముందే మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు నారాయణస్వామి త‌ప్ప‌తాగి వీరంగం సృష్టించారు. పేరూరులో ముఖ్య‌మంత్రి భ‌హిరంగ స‌భ ను ఏర్పాటు చేస్తే, ఈ స‌భ‌కు నారాయణస్వామి త‌ప్ప‌తాగి వ‌చ్చారు. అయితే అక్క‌డే చిల్ల‌ర కొట్లు పెట్టుకున్న నాగలక్ష్మమ్మ వద్దకు వచ్చి మ‌ధ్యం మ‌త్తులో ఒక వాట‌ర్ బాటిల్ సిగ‌రెట్ తీసుకున్నాడు. 
 
వాటికి స‌రిప‌డ డ‌బ్బులు నాగలక్ష్మమ్మ అడిగితే... నన్నే డ‌బ్బులు అడుగుతావా నీ... అ... అంటూ అమెపై దాడీ చేయ‌బోయాడు. అయితే అక్క‌డే ఉన్న పోలీసులు చూస్తూ ఉండిపోయారు తప్ప ఆయ‌న పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో అక్క‌డే ఉన్న స్థానికులు అడ్డుకునేందుకు వెళ్తె వారిపై కూడా దాడి చేశారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.