టీడీపీలో పెరుగుతున్న శ‌త్రుశేషం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-14 15:40:41

టీడీపీలో పెరుగుతున్న శ‌త్రుశేషం

ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కుల్లో మిత్ర‌ప‌క్షం కంటే, శ‌త్రుశేషం విప‌రీతంగా పెరిగిపోతుంద‌ని తాజ‌గా విశ్లేష‌కులు తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెగ్మెంట్ వారీగా త‌మ‌దంటే త‌మ‌ది ఆదిప‌త్యం కొన‌సాగాల‌నే నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కుల్లోనే విప‌రీతంగా వ‌ర్గ‌పోరు తారా స్థాయికి చేరుకుంటోంది. అయితే మ‌రోవైపు ఈ వ‌ర్గ‌పోరును త‌ట్టుకోలేక టీడీపీ నాయ‌కులు త‌మ‌ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలోకి త‌మ అనుచ‌రుల‌తో చేరుతున్నారు.
 
ఇక ఇదే క్ర‌మంలో టీడీపీ హోంమంత్రి చిన‌రాజ‌ప్ప ఓ ప్ర‌ముఖ మీడియా ఛాన‌ల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ, త‌న‌కు ఇద్ద‌రు శ‌త్రువులు వున్నార‌ని, వారిలో ఒక‌డు పోయాడ‌ని ఇంకొక‌డు ఉన్నాడ‌ని ఏక వ‌చ‌నంతో మాట్లాడి సంచ‌లనం సృష్టించారు రాజ‌ప్ప‌. ఈ ఇద్ద‌రిలో ఒక‌డు మెట్ల సత్య నారాయణరావు, ఇంకొక‌డు బొడ్డు భాస్కర రామారావు అని చెప్పారు. ఇక‌ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నాయ‌కుల్లో వ్య‌తిరేక‌త విప‌రీతంగా పెరిగిపోతుంది. దివంగత నేత మెట్ల సత్యనారాయణరావు చ‌నిపోయిన వ్య‌క్తి గురించి ఇష్టానుసారంగా మాట్లాడ‌టం స‌రికాద‌ని మెట్ల వ‌ర్గానికి చెందిన వ్య‌క్తులు మండిప‌డుతున్నారు. చిన‌రాజ‌ప్ప చేసిన వ్యాఖ్య‌లు వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని లేక‌పోతే ఆయ‌న‌ను పెద్దాపురంలో తిరగ‌నీయ‌మ‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.
 
ఇక ఇదే క్ర‌మంలో చిన‌రాజ‌ప్ప ఇద్ద‌రి శ‌త్రువుల‌లో రెండో వ్య‌క్తి అయిన‌టువంటి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తాజాగా చిన‌రాజ‌ప్ప చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న లేఖ ద్వారా పేర్కొంటు చినరాజప్ప లాంటి సంస్కారహీనుడికి మిత్రుడిగా ఉండడం కంటే శత్రువుగా ఉండడమే సంతోషంగా ఉందని ఆయ‌న పేర్కొన్నారు.
 
మీ స్థాయికి, మీ సంస్కారానికి ఎక్క‌డా పొంతన లేదని మీ మాటలను బట్టే అర్థమవుతోందని బొడ్డు భాస్కర రామారావు లేఖ‌లో తెలిపారు. అందుకే ఆయ‌న‌కు మిత్రుడుగా ఉండ‌టం కంటే శ‌త్రువుగా ఉండడ‌మేమంచిద‌ని ఆయ‌న అన్నారు. సంస్కారం లేకుండా రాజప్ప మాట్లాడారని,హోం మంత్రి పదవి కే అప్రతిష్ట తెస్తున్నారని బొడ్డు భాస్కర రామారావు ఆరోపించారు.
 
అయితే ఇక ఇదే విష‌యంపై రాజ‌కీయ విశ్లేష‌కులు స‌ర్వే నిర్వ‌హించారు. మంత్రి చినరాజ‌ప్ప 2019 ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంతో అక్క‌డి రాజ‌కీయం నిప్పు-ఉప్పులా మారుతోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. పెద్దాపురంలో టీడీపీ నాయ‌కుల మ‌ధ్య పొంత‌న కుద‌ర‌టం లేద‌ని ఈ నేప‌థ్యంలో టీడీపీ రెండు వ‌ర్గాలుగా విడిపోయి వ్య‌వ‌హ‌రిస్తార‌ని విశ్లేష‌కులు తెలుపుతున్నారు. ఇక ఈ వ‌ర్గపోరు మ‌రికొన్ని రోజుల పాటు కొన‌సాగితే టీడీపీ నాయ‌కులు పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు సిద్దమ‌య్యే ఛాన్స్ ఎక్కుగా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.