టీడీపీ నేత‌కు టీడీపీ నేతే చెక్ వెనక్కి త‌గ్గేదే లేదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-08-28 04:53:08

టీడీపీ నేత‌కు టీడీపీ నేతే చెక్ వెనక్కి త‌గ్గేదే లేదు

మాజీ మంత్రి కొండ్రుముర‌ళీ అధికార తెలుగుదేశం పార్టీలో చేర‌క‌ముందే చిచ్చు రాజుకుంటోంది. రాజాం టీడీపీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ ప్ర‌తిభా భార‌తి ఈ ప‌రిణామాల‌పై ర‌గిలిపోతున్నార‌ట‌. కొన్నాళ్ల కింద‌ట కొండ్రును టీడీపీలోకి తీసుకు వ‌చ్చేందుకు మంత్రి కళా వెంక‌ట్రావు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను తెలుసుకున్న ప్ర‌తిభా భార‌తి టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశార‌ట‌. సాక్షాత్తు జిల్లా స‌మ‌న్వ‌య క‌మిటల్లో మంత్రులు పితాని అచ్చెన్నాయుడుల మ‌ధ్య క‌న్నీళ్లు పెట్టుకుని మ‌రి త‌న‌ను క‌ళా వెంక‌ట‌రావు అణ‌గ‌దొక్కేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ట‌. 
 
అదే స‌మ‌యంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిభా భార‌తికి మ‌ద్ద‌తుగా నిలిచార‌ని స‌మాచారం. అంతేకాదు గ‌తంలో ప్ర‌తిభ‌కు ఎమ్మెల్సీ కూడు ఆయ‌నే ఇప్పించార‌ట‌. రాజాంలో ఎలాగైనా ప్ర‌తిభ‌కు చెక్ పెట్టాల‌నే ఉద్దేశంతో ఉన్న క‌ళా వెంక‌ట‌రావు కూడా  ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేదంటున్నార‌ట‌. సాక్షాత్తు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుమారుడు మంత్రి లోకేశ్ ల‌తో క‌ళానే చ‌ర్చ‌లు జ‌రిపి టీడీపీలోకి కొండ్రుముర‌ళి చేరిక‌కు మార్గం సుగ‌మం చేశార‌ట‌.
 
ఇక టీడీపీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో కొండ్రుముర‌ళి, క‌ళా వెంక‌ట్ రావు, అశోక్ గ‌జ‌ప‌తి రాజు, చంద్రబాబు, లోకేశ్ ల‌తో వ‌రుస భేటీలు అయ్యారు. ఈ భేటీ అనంత‌రం ఈ నెల 31న పార్టీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక  ఈ పరిణామాలు మాత్రం అచ్చెన్నాయుడు జీర్ణించుకోలేక పోతున్నార‌ట‌. ప్ర‌తిభా భార‌తి కూడా త‌న కూతురుకు ఇస్తార‌నుకున్న రాజాం టికెట్ కి ఇప్పుడు క‌ళా వెంక‌ట‌రావు ఎర్త్ పెట్టార‌న్న ఆగ్ర‌హంతో ఊగిపోతున్నార‌ట‌. 
 
దీంతో మంత్రి అచ్చెన్నాయుడు ఈ చేరిక‌పై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవ‌లే కొండ్రుముర‌ళి టీడీపీ మర్యాద పూర్వ‌కంగా నేత‌ల‌ను క‌లిసినా మంత్రి అచ్చెన్నాయుడుతో మ‌ర్యాద‌పూర్వ‌కంగా కూడా క‌ల‌వ‌లేద‌ట‌. అయితే మంత్రి అచ్చెన్నాయుడే కొండ్రుముర‌ళికి ఆ అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని టీడీపీ నేత‌లే గుస‌గులాడుతున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.