ప‌శ్చిమ గోదావ‌రి టీడీపీలో టికెట్ వార్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-14 10:42:28

ప‌శ్చిమ గోదావ‌రి టీడీపీలో టికెట్ వార్

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ముందుకు దూసుకు వ‌చ్చిన లీడ‌ర్ పీత‌ల సుజాత‌. అయితే ఆమె ఇప్పుడు అంతేవేగంగా  పొలిటిక‌ల్ కెరియ‌ర్ చుట్టు ప్ర‌శ్నార్థ‌కాలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయ‌ట‌. గ‌తంలో ప్ర‌భుత్వ టీచ‌ర్ గా ప‌నిచేస్తూ తెలుగుదేశం పార్టీ కి జైకొట్టారు సుజాత. చంద్ర‌బాబు పాద‌యాత్ర‌లో ఆయ‌న‌తో క‌లిసి న‌డ‌వ‌డంతో గ‌త ఎన్నిక‌ల్లో సొంత నియోజ‌క‌వ‌ర్గం కాక‌పోయినా చింతలపూడినుంచి అవ‌కాశం ఇచ్చారు అధినేత. ఇక ఆమె ఆ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత మంత్రి ప‌ద‌విని కూడా ఇచ్చారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు.

 
త‌క్కువ కాలంలో పొలిటిక‌ల్ కేరియ‌ర్ లో వేగంగా దూసుకువెళ్లిన సుజాత ప్ర‌స్తుతం అంతేవేగంగ త‌న ప‌ట్టును కోల్పోతు వ‌చ్చార‌ట‌. ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ఏలూరు ఎంపీ మాగంటి బాబుల‌తో కొంత‌కాలంగా ఆమెకు పొస‌గ‌కుంద‌ట‌. దీంతో పాటు వివిధ కోణాల్లో విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆమెను మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించారు చంద్ర‌బాబు నాయుడు. ఇక అప్ప‌టినుంచి చింత‌పూల‌డిలో త‌న ప‌ట్టు నిలుపుకోవ‌డానికి సుజాత చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌కున్నాయ‌ట‌. 
 
పీత‌ల సుజాత‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుందా లేదా! ఒక వేల టికెట్ కేటాయిస్తే ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారు అన్న అనుమాలు ప్ర‌స్తుతం ఆమె అనుచ‌రులు అనుమానిస్తున్నారట‌. పార్టీకి విధేయురాలుగా ఉన్నా సొంత నియోజ‌క‌వ‌ర్గం సొంత‌వ‌ర్గం లేకపోవ‌డం పీత‌ల సుజాత‌కు పెద్ద‌మైన‌స్ గా మారుతున్నాయ‌ట‌. 2019లో ఎలాగైనా చింత‌ల‌పూడిలో టీడీపీ త‌ర‌పున టికెట్ ద‌క్కించుకోవాల‌ని సుజాత ఎత్తుల వేస్తున్న వేళ అసంమ్మ‌తినేత‌లు మ‌రింత వేగంగా పావులుక‌దుపుతున్నార‌ట‌. 
 
ఇదే క్ర‌మంలో మాజీ జిల్లా చైర్ ప‌ర్స‌న్ జ‌య‌రాజు అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధిష్టానం త‌న‌కే టికెట్ ఇస్తుంద‌ని చింత‌ల‌పూడి నుంచి తానే పోటీ చేస్తాన‌ని నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేసుకుంటున్నార‌ట‌. అలా గే తాడేప‌ల్లిగూడెంలో ఆర్టీవోగా ఉన్న విజ‌య‌రాజు చింత‌ల‌పూడి నుంచి టీడీపీ త‌ర‌పున పోటీకి రెడీ అవుతున్నార‌ట‌. చింత‌ల‌పూడిలో విజ‌య‌రాజుకు మంచి ప‌రిచ‌మాలు ఉన్నాయ‌ట‌. 
 
ఇక స్థానికంగా సుజాత సామాజిక వ‌ర్గానికి చెందిన కొంత‌మంది కూడా టికెట్ కోసం సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. సిట్టింగ్ ఎఎమ్మెల్యే హోదాలో టికెట్ వార్ లో అంద‌రి కంటే ముందు ఉండాల్సిన సుజాత ప్ర‌స్తుతం రేస్ లో వెనుక‌బ‌డిపోతున్నారట‌. జిల్లాలో చింత‌ల‌పూడి, కొవ్వూరు, గోపాల‌పురం, నియోజ‌క‌వ‌ర్గ స్థానాలు రిజ‌ర్వుడు స్థానాలు. ఇక కొవ్వూరులో మంత్రి జ‌వ‌హ‌ర్ ఉన్నారు. ఇక ఈ మూడు స్థానాల్లో ఏ టికెట్ సుజాత ద‌క్కించుకుంటారో అన్న‌ది చ‌ర్చ‌నీశంగా మారింద‌ట‌. అయితే ఆమె మాత్రం అధిష్టానం మీదే పూర్తి భారం వేసి త‌న‌పని తాను చేసుకుంటూ పోతున్నార‌ట‌. దీంతో టికెట్ వార్ లో విజ‌యం సుజాత‌దా లేక త‌న ప్ర‌త్య‌ర్ధుల‌దా అనేది టీడీపీలో హాట్ టాపిక్ గా మారింద‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.