సీమ‌లో ఆగ‌ని వ‌ర్గ‌పోరు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-09-28 11:10:07

సీమ‌లో ఆగ‌ని వ‌ర్గ‌పోరు

2019 ఎన్నిక‌లు దగ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల్లో వ‌ర్గ‌పోరు ర‌చ్చ‌కెక్కుతుంది. తాజాగా ఇదే కోవ‌లో బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం కూడా చేరింది. చ‌ల్లా రామ‌కృష్టారెడ్డి టీడీపీలోకి వ‌చ్చిన‌ప్పుడు 2014 ఎన్నిక‌ల్లో బీసీ జ‌నార్థ‌న్ రెడ్డిని గెలిపించాల‌ని చంద్ర‌బాబు నాయుడు సూచించార‌ట‌. దానికి ప్ర‌తిఫ‌లంగా చ‌ల్లాకు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌ట‌. జ‌నార్థ‌న్ రెడ్డి గెలిచిన త‌ర్వాత చ‌ల్లాకు ఇచ్చిన హామీని బాబు మ‌ర్చిపోయారట‌. 
 
ఈ నియోజ‌వ‌ర్గంలో చ‌ల్లా ప్రాధాన్య‌త తగ్గించాల‌ని బ‌న‌గాన‌ప‌ల్లె నియెజ‌క‌వ‌ర్గానికి తానొక్క‌డినే రాజుగా ఉండాల‌నే ఆలోచ‌న‌తో బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి మొద‌టి నుంచి భావిస్తున్నార‌ట‌. అయితే గ‌త ఎన్నిక‌ల్లో చ‌ల్లా స‌హ‌కారంతో గెలిచాను కాబ‌ట్టి ఆయ‌న‌కు ఏదో మేలు చేసిన‌ట్లుగా చిట్ట‌చివ‌ర ఒక సంవ‌త్స‌రం ఉండ‌గా చ‌ల్లాకు రాష్ట్ర పౌరస‌ర‌ఫ‌రాల సంస్థ‌ల చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చి చేతులు దులుపుకోవాల‌ని చూశార‌ట‌.
 
అయితే టిట్ ఫ‌ర్ ట్యాట్ లాగా చైర్మ‌న్ గా ఉన్నంత‌కాలం బీసీ జ‌నార్థ‌న్ రెడ్డిని లెక్క చేయ‌కుండా టీడీపీ కార్య‌క్ర‌మాల‌ను చెయ్యాల‌ని చ‌ల్లా ఫిక్స్ అయ్యార‌ట‌. బ‌న‌గాన‌ప‌ల్లెలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి స్థానిక ఎమ్మెల్యే బీసీ జ‌నార్థ‌న్ రెడ్డిని పిల‌వ‌టంలేదట‌. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌ర్నూల్ టూర్ లో భాగంగా అక్క‌డ మీటింగ్ పెట్ట‌కుండా బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి త‌న‌కు అనుకూలమైన‌ కొలిమి గుండ్ల‌లో ఏర్పాటు చేయ‌టంతో ఇద్ద‌రి మ‌ధ్య వైర్యం ముదిరి పాకాన‌ప‌డిన‌ట్లు అయింది. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌ల‌తో తెలుగు త‌మ్ముళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నార‌ట‌. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.