బాబుగారు ఇదెక్క‌డి తెలుగండి బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-07 18:54:33

బాబుగారు ఇదెక్క‌డి తెలుగండి బాబు

ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌లు మాతృభాష‌కు పెద్ద పీట వేస్తుంటే మ‌న రాష్ట్రంలో అదీ ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మాత్రం భాష‌కు ఎంత మేర‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ‌కు సంబంధించి ఒక బ్యాన‌ర్ ను ఏర్పాటు చేశారు. 
 
ఈ బ్యాన‌ర్ లో ఒక వైపు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఫోటో ఉంటే మ‌రో వైపు ఫిరాయింపు మంత్రి అఖిల ప్రియ ఫోటో ఉంది. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య ఎర్ర‌ని పెద్ద అక్షారాల‌తో ప్ర‌జ‌లు ఆక‌ర్షించే విధంగా తెలుగులో  భాసా సాంస్కృతిక అనే టెక్స్ట్‌ ను ప్రింట్ చేయించారు అధికారులు. కానీ వాస్త‌వానికి అది క‌రెక్ట్ కాదు భాషా సాంస్కృతిక అని ముద్రించాలి. ఇక ఈ విష‌యంపై ప్ర‌తీ ఒక్క‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
ముక్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తి పాఠ‌శాల‌లో, క‌ళాశాల‌లో తెలుగు స‌బ్జెక్ట్ ఉండాల‌ని మాతృ భాష‌ను మ‌రిచిపోకూడ‌ని చాలా సంద‌ర్భంలో చెప్పార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు అయితే చంద్ర‌బాబు పార్టీలో కూడా తెలుగు ఉంద‌ని అందుకే  తెలుగు భాష‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని చెప్పార‌ని కానీ టీడీపీలో ఉన్న నాయ‌కుల‌కే తెలుగు స‌రిగ్గా రాకుంటే ఇత‌రుల‌ను తెలుగు భాష గురించి ప్ర‌శ్నించే అధికారం లేద‌ని మండిప‌డుతున్నారు. చూద్దాం ఈ భాసా గురించి మ‌న నాయ‌కులు ఎలాంటి సాకు చెప్పి త‌ప్పించుకుంటారో.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.