లీకుల్లో చిక్కుకున్న టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-10 12:11:32

లీకుల్లో చిక్కుకున్న టీడీపీ

కేంద్రం ఏపీకి సాయం చేయాలి విభ‌జ‌న హామీలు నెర‌వేర్చాలి అని కోరుతున్నా, ఏపీ ప్ర‌జ‌ల‌కు కేంద్రం ఎటువంటి తీపి క‌బురు అందించ‌డం లేదు.. అయితే లీకుల్లో ఆరితేరిన తెలుగుదేశం నాయ‌కులు మ‌రో డ్రామాకి తెర‌లేపారు..ప్ర‌ధాని మోదీ ఏపీకి నిధులు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నార‌ని అని తెలుగుదేశం నాయ‌కులు తెలుపుతున్నారు.. అదే పందాన ఆస్ధాన‌మీడియాలు కూడా అదే భ‌జ‌న చేస్తున్నాయి..
 
ఏపీకి సానుకూలంగా కేంద్రం ఉంద‌ని అమ‌రావ‌తి నిర్మాణానికి  నిధులు ఇస్తాము అని కేంద్రం చెబితే, ఆ విష‌యం మీడియా ముఖంగా ఓ నోట్ రూపంలో అయినా విడుద‌ల అవుతుంది.. అయితే అవేమీ లేకుండా ఏపీకి సాయం చేయ‌డానికి కేంద్రం అంగీక‌రించింది అని ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి న‌మ్మ‌బ‌లికేందుకు ఎత్తులు వేస్తోంది అధికార పార్టీ.
 
పార్ల‌మెంట్ జ‌రిగిన స‌మ‌యంలో దీనిపై ఎటువంటి డ్రామా ఆడారో తెలిసిందే... మీడియా ముఖంగా మ‌ళ్లీ ఇదే డ్రామా పార్ల‌మెంట్ వాయిదా ప‌డిన త‌ర్వాత కూడా  ఆడుతున్నారు అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు వైసీపీ నాయ‌కులు.
తాజాగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఏపీకి ప్యాకేజీ ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, కేంద్రం బాబుకు భ‌య‌ప‌డింద‌ని అనేకానేక వార్త‌లు వండివారుస్తున్నాయి.. అయితే ఇదంతా లీకుల బాగోతం అంటూ కొట్టిపారేసింది వైసీపీ.
 
జైట్లీ, అమిత్‌షా, పీయూష్‌ గోయల్, సుజనా చౌదరిలు సమావేశమై, హామీల అమలుకు అంగీకరించినట్లు మీడియాకు విస్తృతంగా లీకులిచ్చింది. ప్రధాని మోదీ , ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ రెండుసార్లు పార్లమెంట్‌లో చేసిన తమ ప్రసంగాల్లో ఎక్కడా విభజన హామీలు అమలు చేస్తామని చెప్పలేదు. మ‌రి వాయిదా ప‌డిన త‌ర్వాత ఎవ‌రికి క్లారిటీ ఇచ్చారో తెలియాల్సి ఉంది.
 
ఇక మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌ను ఏపీ బీజేపీ నాయ‌కులు కూడా ఆలోచిస్తున్నారు.. మాకు రాని స‌మాచారం వీరికి ఎలా వ‌స్తుంది ఇదంతా బోగ‌స్ అంటున్నారు... అయితే క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ, విశాఖ‌కు ప్ర‌త్యేక రైల్వేజోన్, అమ‌రావ‌తి నిర్మాణం అన్నింటికి కేంద్రం పార్ల‌మెంట్ స‌మావేశాలు వాయిదా ప‌డిన త‌ర్వాత, ఒకే చెప్పింద‌ట... అది కూడా స‌మావేశంలో.. ఇదే వార్త మీడియాలో హైలెట్ అవుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.