వైసీపీలోకి భారీ చేరిక‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-25 13:11:19

వైసీపీలోకి భారీ చేరిక‌లు

ప్రతిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని త‌న సొంత గ్రామం అయిన‌ ఇడుపుల‌పాయ నుంచి పాద‌యాత్ర చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ పాద‌యాత్రలో జ‌గ‌న్ తో పాటు ప్ర‌జ‌లు అడుగులో అడుగు వేస్తూ నేనున్నాను.. అన్నా అంటూ జ‌న‌నేత‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.
 
అయితే ప్ర‌స్తుతం ఈ సంక‌ల్ప‌యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఇక ఈ పాద‌యాత్ర‌లో భాగంగా రోజు రోజుకు ప్ర‌జ‌ల నుంచి వైఎస్ జ‌గ‌న్ కు అధిక సంఖ్య‌లో మ‌ద్ద‌తు పెరుగుతోంది. దీంతో టీడీపీ నాయ‌కులంతా  వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.
 
ఇక ఇప్ప‌టికే చాల మంది సీనియ‌ర్ టీడీపీ నాయ‌కులు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా బీమ‌డోలు మండ‌లంలోని పోలసానిపల్లి టీడీపీ మహిళా ఎంపీటీసీ షేక్‌ రహీమా బేగం, షేక్ హుసేన్ సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పి గణపవరం మండలం సరిపల్లి గ్రామం వ‌ద్ద పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ ను క‌లిసి ఆయ‌న స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన హామీల‌ను చూసి ఎంతో ఆనందించామ‌ని అందుకే తాము వైసీపీలోకి చేరామ‌ని అన్నారు. 
 
అలాగే రాష్ట్రానికి అమ‌ర సంజీవ‌నీ అయిన ప్ర‌త్యేక హోదా సాధించాలి అంటే అది జ‌గ‌న్ వ‌ల్లే సాధ్యం అవుతుంద‌ని తెలిపారు. 2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ఇంత వ‌ర‌కు ఈ జిల్లాలో ఒక్క‌చోట కూడా అభివృద్ది కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌లేద‌ని అన్నారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నాయ‌కుల మీద న‌మ్మ‌కం పోయింద‌ని, ఇప్పుడు మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం జ‌గ‌న్ ద్వారా చూడాల‌ని ప్ర‌జ‌లు ఆసిస్తున్నార‌ని తెలిపారు.
 
కాగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే 2014 ఎన్నిక‌ల్లో ఒక్క సీటు కూడా వైసీపీ రాలేదు. అయితే 2019 ఎన్నిక‌ల్లో సేమ్ ఇదే టీడీపీ నాయ‌కుల‌కు రుచి చూపించాల‌ని ప్ర‌జ‌లు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.