టీడీపీ మీటింగ్ హైలెట్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-04 02:34:55

టీడీపీ మీటింగ్ హైలెట్స్

కేంద్ర బ‌డ్జెట్  అంశం  నేప‌థ్యంలో ఆస‌క్తిక‌రంగా సాగిన తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంట‌రీ సమావేశం ముగిసింది. బీజేపీ-టీడీపీ పొత్తు  విష‌యంతో పాటు పార్ల‌మెంట్ లో వ్య‌వ‌హరించాల్సిన తీరుపై పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పార్టీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు.
 
స‌మావేశం ముగిసిన అనంత‌రం టీడీపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని నిల‌దీసేందుకు సిద్ద‌మౌతున్నామ‌ని అన్నారు. ముందు కేంద్రాన్ని మన రాష్ట్రానికి రావాల్సిన వాటిని  కోర‌నున్న‌ట్లు తెలిపారు. అవ‌స‌ర‌మైతేనే స‌మావేశాల్లో నిర‌స‌న తెలియ‌జేస్తామ‌ని సుజ‌న పేర్కొన‌డం గ‌మ‌నార్హం. 
 
మిత్ర ప‌క్షం కావున బీజేపీ అధిష్టానం రాష్ట్ర పరిస్ధితుల‌ను అర్ధం  చేసుకుంటుంద‌ని ఆయ‌న ఆశాభావం  వ్య‌క్తం చేశారు. రాజీనామాలు, పొత్తు విర‌మ‌ణ వంటి వాటిపై అధినేత చంద్ర‌బాబుదే అంతిమ నిర్ణ‌యమ‌ని, ఇప్ప‌టికైతే  వాటిపై ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోలేద‌ని అన్నారు. 
 
ప్ర‌త్యేక హొదాతో పాటు విభజ‌న అంశంలో పేర్కొన్న అంశాల‌ను నెర‌వేర్చ‌డంలో విఫ‌ల‌మైన బీజేపీపై టీడీపీ తిరుగుబాటు జెండా ఎగుర‌వేస్తుందంటూ మేక‌పోతు గాంభీర్యం మాత్ర‌మే ప్ర‌ద‌ర్శించారు. రాజీనామా ఏమోగాని కేంద్రాన్ని గ‌ట్టిగా నిల‌దీసే ప‌రిస్ధితుల్లో కూడా టీడీపీ లేదని చెప్ప‌డంలో ఏమాత్రం సందేహం లేద‌ని చెప్ప‌వ‌చ్చు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.