తోక ముడిచిన ఆదినార‌య‌ణ రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-16 12:07:42

తోక ముడిచిన ఆదినార‌య‌ణ రెడ్డి

ఏపీ రాజ‌కీయాలు ప్ర‌స్తుతం అస‌క్తిక‌రంగా కొన‌సాగుతున్నాయి. ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయం పై పోరాటం చేస్తున్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ. ప్ర‌త్యేక హోదా సాధ‌న  కోసం ఏప్రిల్‌ 6న‌ వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తార‌ని పాద‌యాత్ర‌లో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు వైయ‌స్ జ‌గ‌న్‌.
 
ఉద‌య‌గిరి బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ... హోదా కోసం వైసీపీ చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ సైతం క‌లిసి రావాల‌ని జ‌గ‌న్ కోరారు. రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని పార్టీలు ఒకే వేదిక పైకి వ‌చ్చి పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలియ‌జేశారు. ప్ర‌త్యేక హోదా పై టీడీపీ ఇంత‌వ‌ర‌కు నిర్ద‌ష్ట‌మైన పోరాటం చేయ‌లేద‌ని జ‌గ‌న్ అన్నారు.
 
దీనికి స్పందించిన మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి మార్చి 5న టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి హోదా క‌థ‌ను ముగిస్తార‌ని మ‌రో సంచ‌ల‌నం సృష్టించారు. అయితే కొద్దిసేప‌టికే మీడియా ముందుకు వ‌చ్చిన మంత్రి ఆది తాను చేసిన ప్ర‌క‌ట‌న వ్య‌క్తిగ‌తమ‌ని మాట మార్చారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.