మ‌రో బాంబ్ పేల్చిన మంత్రి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-19 03:02:29

మ‌రో బాంబ్ పేల్చిన మంత్రి

కేంద్ర వైఖరికి వ్య‌తిరేకంగా మార్చి 5 న తెలుగు దేశం పార్టీకి చెందిన మంత్రులు రాజీనామా చేస్తారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఆదినారాయ‌ణ రెడ్డి... మ‌రోసారి బాంబ్ పేల్చారు. మార్చి 5లోపు కేంద్రానికి మా 19 డిమాండ్లు తీర్చాల‌ని గ‌డువు పెట్టిన‌ట్లు మంత్రి ఆది మ‌రోసారి గుర్తు చేశారు. 
 
డిమాండ్లు తీర్చ‌క‌పోతే కేంద్రానికి జ‌న‌గ‌ణ‌మ‌ణ పాడ‌తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేక హోదా క‌ల....దాని గురించి పోరాడ‌టం వృథా అని మంత్రి అన్నారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఎన్ని రోజులు కుక్క‌తోక ప‌ట్టుకుని స‌ముద్రాన్ని ఈదుతారు అంటూ ఎద్దేవా చేశారు. 
 
సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని ఎర్ర‌గుంట్ల‌లో ప‌ర్య‌టించిన ఆయ‌న  ఈ వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో మంత్రులు రాజీనామా చేస్తార‌ని చెప్పిన మంత్రి ఆదిపై చంద్ర‌బాబు క‌స్సుబుస్సుమ‌న్న‌ట్లు లీకులు వ‌చ్చాయి. ఇది మ‌రువ‌క ముందే ఆది నారాయ‌ణ రెడ్డి, వైసీపీ పై మ‌రో సారి విమ‌ర్శ‌లు చేస్తూ...రాజీనామాల‌ను ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. 
 
మ‌రి హోదా కోసం అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టేందుకు జ‌గ‌న్ సిద్ద‌మ‌ని చెప్పిన వ్యాఖ్య‌ల‌కు టీడీపీ నేత‌లు సూటిగా స‌మాధానం చెప్పలేదు. ఈ క్ర‌మంలో మంత్రి ఆది వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి టీడీపీ హోదాపై పూర్తిగా చేతులు  ఎత్తేసింద‌ని మ‌రోసారి స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది.  హోదాను ప‌క్క‌కు పెట్టిన పార్టీల‌ను ఏపీ ప్ర‌జ‌లు ప‌ట్టించుకుంటారా... లేదా చూడాలి మ‌రి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.