ఎస్సీ, ఎస్టీల‌పై టీడీపీ మంత్రి సంచ‌లన‌ వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-02 11:48:05

ఎస్సీ, ఎస్టీల‌పై టీడీపీ మంత్రి సంచ‌లన‌ వ్యాఖ్య‌లు

ప్ర‌జ‌ల‌చేత ప్ర‌జ‌లకొర‌కు ఎన్నుకోబడిన ప్ర‌జాస్వామ్య నాయ‌కుడు నిత్యం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కానీ, త‌న జిల్లాలో కానీ ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా పరిష్కరించాలి. అంతేకాదు ప్ర‌జ‌ల మ‌ధ్య కుల చిచ్చు ర‌గిలితే వారికి న‌చ్చ జెప్పి పంపించే వారు నిజ‌మైన ప్ర‌జాస్వామ్య నాయ‌కుడు. కానీ తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ప్ర‌జాస్వామ్యాన్నిమ‌రిచి, రాజ్యంగానికి విరుద్దంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాజ్యంగాని విరుద్దంగా అనే కార్య‌క్ర‌మాలు చేశారు. అందులో మొదటగా వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీలో చేర్చుకోవ‌డం ఒక్క‌టి అయితే... మ‌రోక‌టి  స‌భా ముఖంగా ఎస్సీలను కించ‌పరిచే విధంగా మాట్లాడ‌టం. ఈ రెండింటి విష‌యంలో టీడీపీ నాయ‌కులు ఆరితేరిపోయారు.
 
అనేక సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు నాయుడు తమ పార్టీ ద‌ళితుల పార్టీ, తాను ద‌ళితుల‌కు అండ‌గా నిలుస్తాన‌ని చెప్పారు. అయితే అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత స‌భాముఖంగా ద‌ళితుల‌ను కించ‌ప‌రిచేవిధంగా పుడ‌తా పుడ‌తా ఎస్సీలుగా పుట్టాల‌ని ఎవ‌రు కోరుకుంటార‌ని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఎస్సీల‌ను కించ‌ప‌రిచారు. మ‌రో మంత్రి ఆధినారాయ‌ణ రెడ్డి క‌డ‌ప జిల్లాలో ఎస్సీ, ఎస్టీలు వారం రోజులు అయినా స్నానం చెయ్య‌ర‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 
ఇక రాష్ట్ర ప్ర‌జ‌లు ఈ విమ‌ర్శ‌లు మ‌రువ‌క ముందే తాజాగా మ‌రో మంత్రి ఎస్సీ, ఎస్టీల‌ను కించ‌ప‌రిచే విధంగా మాట్లాడారు. నిన్న‌టితో  గ్రామ స‌ర్పంచ్ ల ప‌ద‌వులు ముగీయ‌నున్న క్ర‌మంలో మంత్రి అయ్య‌న్న పాత్రుడు విశాఖప‌ట్నంలో స‌మావేశం అయి మాట్లాడుతూ పంచాయితీలో రిజ‌ర్వేష‌న్ల‌ను కించ‌ప‌రిచే విధంగా మాట్లాడారు. స‌ర్పంచ్ లుగా ఉన్న ఎస్సీ, ఎస్టీల పెత్త‌నం అంతా తెలుగుదేశం పార్టీ నాయ‌కులదే అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.