ప్ర‌మోషన్ కావాలంటే ఆ మంత్రికి 5 ల‌క్ష‌లు చెల్లించాల్సిందే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-28 17:58:24

ప్ర‌మోషన్ కావాలంటే ఆ మంత్రికి 5 ల‌క్ష‌లు చెల్లించాల్సిందే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఎక్సైజ్‌ శాఖ ఉద్యోగాలు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మ‌ద్యం కేసు కార‌ణంగా డిపార్ట్ మెంట్ లోని అన్ని స్థాయిల వారిగా ప్ర‌మోష‌న్లు నిలిచిపోయాయి. అయితే ఉద్యోగుల న్యాయ పోరాటం కేసుతో సంబంధం లేకుండా ప్ర‌మోష‌న్లు క‌ల్పించాల‌ని ట్రిబ్యున‌ల్ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సుమారు నాలుగు సంవ‌త్స‌రాల క్రితం నుంచి ట్రిబ్యున‌ల్ తీర్పును ఇచ్చినా ఇప్ప‌టికి టీడీపీ ప్ర‌భుత్వం ఎక్సైజ్‌ శాఖలో ప్ర‌మోష‌న్లు క‌ల్పించ‌లేదు.
 
న్యాయ స‌ల‌హా కోసం ఆరునెల‌లుగా ప్ర‌మోష‌న్ల వ్యవ‌హారం పెండింగ్ లో ప‌డిపోయింది. అయితే ఎందుకు ఇలా పెండింగ్ లో ప‌డిపోయింద‌ని ఆరాతీస్తే అస‌లు అవినీతి క‌థ వెలుగు చూసింది. ఎక్సైజ్‌ శాఖలో ఇప్పుడు ఏ అధికారి ఏ ఉద్యోగి ఒక‌రినొక‌రు క‌లుసుకున్నా ఈ ప్ర‌మోషన్ల పెచీ కోస‌మే చ‌ర్చించుకుంటున్నార‌ట‌. ఎందుకంటే ప్ర‌మోష‌న్లు ఆగిపోవ‌డానికి సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన‌ మంత్రి పాత్ర ఉంద‌ని ఉద్యోగులు చెబుతున్నారు. 
 
ఎక్సైజ్‌ శాఖలోని ఉద్యోగులకు ప్ర‌మోష‌న్లను ఇవ్వాలంటే టీడీపీ ప్ర‌భుత్వానికి ఓ మంత్రికి ముడుపులు చెల్లిస్తే కానీ కుద‌ర‌ద‌ని పెచీ పెట్టార‌ట‌. అయితే కీల‌కమైన డిప్యూటి క‌మిష‌న‌ర్లు, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్లు ఎక్సెంజ్ సూప‌ర్ డెంట్ పోస్ట్ లు అధికారుల‌కు ప్ర‌మొష‌న్ల ద్వారా ల‌భించ‌నున్నాయి. 
 
ఈ క్ర‌మంలో చూస్తే సుమారు 250 మంది ప్ర‌మొష‌న్లు రావాల్సి ఉంది. కానీ వాటిని కేటాయించ‌లేదు. ఇక ఇదే అదునుగా భావించిన ఆ మంత్రి ప్ర‌మోష‌న్లు కావాలంటే మూడుకోట్లు క‌ప్పం క‌ట్టాల్సిందేన‌ని బ్యారం పెట్టేశార‌ట‌. వాస్త‌వానికి ఈ ప్ర‌మోష‌న్ల వ్య‌వ‌హారం ఎక్సైజ్‌ శాఖలోని ఓ సినియ‌ర్ ఉద్యోగికి అప్ప‌గించార‌ట‌. ఈ మూడుకోట్ల డీల్లో ఆయ‌న భాగస్వామి కావ‌డానికి అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఈ సీనియ‌ర్ ఉద్యోగిని వేరే సెక్షన్ కు కూడా మార్చేశార‌ట‌. 
 
ఒక్కో ప్ర‌మోష‌న్ పోస్ట్ కు క‌నీసం మూడుల‌క్ష‌ల నుంచి ఐదు ల‌క్షల వ‌ర‌కు మంత్రి డిమాండ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక ఈ ముడుపుల గోల తేల‌క‌పోవ‌డంతోనే ఇప్పుడు ఎక్సెంజ్ శాఖలో అధికారుల ప్ర‌మోష‌న్ల‌ను పెండింగ్ లో పెట్టేశార‌ని డిపార్ట్ మెంట్ మొత్తం కోడైకూస్తోంది. మంత్రి డిమాండ్ చేసిన మూడుకోట్ల‌ను ఎందుకు ఇవ్వాల‌ని అధికారులు మండిప‌డుతున్నార‌ట‌. ఎనిమిదేళ్ల త‌ర్వాత ట్రిబ్యున‌ల్ తీర్పు ఇచ్చినా కూడా ప్ర‌మొష‌న్లు ఇవ్వ‌క‌పోవ‌డంపై ఎక్సెంజ్ శాఖ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా స‌ద‌రు మంత్రి ముడుపుల‌మూట తీసుకోకుండా ప్ర‌మోష‌న్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారో లేదో వేచి చూడాలి.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.