మంత్రి సునితా V/S వ‌ర‌దాపురం సూరి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-11 18:21:05

మంత్రి సునితా V/S వ‌ర‌దాపురం సూరి

2019 సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల్లో వ‌ర్గ విభేదాలు ర‌చ్చ‌బండ‌కు ఎక్కుతున్నాయి. కొంత‌మంది టీడీపీ నాయ‌కులు అయితే వ‌వ్చే ఎన్నికల్లో అధిష్టానం త‌మ‌కంటే త‌మ‌కు సీటు ఫిక్స్ చేయాల‌ని ముసుగులో కుమ్ములాట‌ల‌ను కొన‌సాగిస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు అయితే త‌మ నాయ‌కుడి ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను ఇత‌ర టీడీడీ ఎమ్మెల్యేల‌ వ‌ర్గీయులు ఎవ్వ‌రు లేని స‌మ‌యం చూసుకుని వాటిని తొల‌గిస్తున్నారు. 
 
అయితే తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే టీడీపీ కంచుకోట అనంత‌పురం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు క‌లిసి జిల్లాలోని  ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో క‌రువు నేల‌పై కేంద్రం వివ‌క్ష అనే పేరుతో దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష‌లో టీడీపీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి అభిమానంతో కార్య‌క‌ర్త‌లు దీక్షా ప్రాంగ‌ణంలో ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చింపేశారు. దీంతో అక్క‌డి వాతావ‌ర‌ణం హీటెక్కుతోంది ఇది కేవ‌లం మంత్రి ప‌రిటాల సునీత వ‌ర్గీయులు మాత్ర‌మే చేసి ఉంటార‌ని వ‌ర‌దాపురం సూరి అనుచ‌రులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. 
 
దీంతో ఈ విష‌యాన్ని ఎమ్మెల్యే సూరి సీరియ‌స్ గా తీసుకుని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ దీక్ష‌లో ఫ్లెక్పీల‌ను తొల‌గించేందుకు వ‌చ్చిన సునిత వ‌ర్గీయుల‌ను పోలీసు అధికాలు త‌ప్పించార‌ని ఆయ‌న ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేశ్ క‌ర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు టీడీపీ అభ్య‌ర్థుల‌ను ఫిక్స్ చేయ‌డంతో టీడీపీ నేత‌ల మ‌ధ్య‌చిచ్చు ర‌గులుతున్న సంగ‌తి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.