నీకు స‌గం నాకు స‌గం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-14 17:09:31

నీకు స‌గం నాకు స‌గం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న‌ భోజన ప‌థ‌కానికి అంద‌జేసే కందిప‌ప్పులో భారీ అవినీతికి తెర‌లేపారు. ఇద్ద‌రు మంత్రులు ఒక్క‌టి అయితే ఎలా వ్యాపార‌స్తుల‌తో డీల్ కుదుర్చుకుంటారో ఈ కందిప‌ప్పు దందాలో రుజువు అయింది. రాష్ట్రంలోని 45వేల 932 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, 36 ల‌క్ష‌ల 78వేల మంది పిల్ల‌ల‌కు మ‌ధ్యాన్న భోజ‌నం పెడుతున్నారు. వీరి భోజ‌నంలో వినియోగించే 2కోట్ల 10ల‌క్ష‌ల కందిప‌ప్పును స‌ర‌ఫ‌రా చేసేందుకు ప్ర‌భుత్వం ఇటీవ‌లే టెండ‌ర్ల ప్ర‌క్రియ‌నే నిర్వ‌హించింది. 
 
అయితే ఈ టెండ‌ర్ల‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా వ్యాపార సంస్థ‌ల‌కు కాంట్రాక్ట్ ను అధిక ధ‌ర‌ల‌కు క‌ట్ట‌బెట్టేసేందుకు రంగం సిద్ద‌మైయింది. NCCF నాలుగు జిల్లాలు, కేంద్రీయ భాండారుకు ఆరు జిల్లాలు, పూరీ జ‌గ‌న్నాథ్ సంస్థ‌కు మూడు జిల్లాల‌కు కందిప‌ప్పు స‌ర‌ఫ‌రా చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. వాస్త‌వానికి టెండ‌ర్ల నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తీ ఏడాదికి 145 కోట్ల ట‌ర్నోవ‌ర్ తో 435 ట‌ర్నోవ‌ర్ క‌లిగిన కంపెనీలు పాల్గొన్నాలి. ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం సుమారు 8 సంస్థ‌లు టెండ‌ర్ల‌ను దాక‌లు చెయ్యాగా కృష్ణా ఆ జిల్లా మార్క్ ఫెడ్ సంస్థ మాత్రమే అర్హ‌త సాధించింది. 
 
అయితే అర్హ‌త ఉన్న ఈ సంస్థ‌ను ప‌క్క‌న పెట్టేసి ముందే డీల్ కుదిరిన సంస్థ‌ల‌ను ఆమోదించారు. అయితే టెండ‌ర్ల గోల్ మాల్ పై మార్క్ ఫెడ్ సంస్థ కోర్టును ఆశ్ర‌యించింది. పూరి జ‌గ‌న్నాథ్ సంస్థ‌కు అర్హ‌త లేద‌ని మిగిలిన కేంద్రీయ భాండా, NCCF సంస్థ‌లు బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీలని కూడా ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేశారు. 
 
అయితే ఈ నేప‌థ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి, అలాగే విశాఖ జిల్లాకు చెందిన మ‌రో మంత్రి క‌లిసి రంగంలోకి దిగారు. మ‌స్తాన్ రావు అనే వ్యాపారి అలాగే కొంద‌రు మంత్రుల మనుషులు క‌లిసి ఈ వ్య‌వ‌హారాన్ని చ‌క్క‌బెట్టారు. అంతేకాదు ఈ మూడు కంపెనీల మ‌ధ్య డీల్ కుదుర్చి 13 జిల్లాల‌ను క‌ట్ట‌బెట్టేశారు. త్వ‌ర‌లో ఆర్థిక బిడ్ల‌ను ఖ‌రారు చేసేందుకు రంగం సిద్దం చేశారు. మెత్తానికి ఈ ఇద్ద‌రు మంత్రులు కందిప‌ప్పు అధిక ధ‌ర‌ల‌కు కొని నీకు సగం నాకు స‌గం అన్న చందంగా అవినీతి వ్యాపారం కొన‌సాగిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment