బ్రేకింగ్.. జ‌గ‌న్ తో ర‌హ‌స్య భేటి వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and amanchi krishna mohan
Updated:  2018-10-08 04:03:08

బ్రేకింగ్.. జ‌గ‌న్ తో ర‌హ‌స్య భేటి వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో రాజ‌కీయ పార్టీ నాయ‌కుల‌కు ఎన్నిక‌ల సెగ త‌గులుతుంది. అయితే ఇప్ప‌టికే తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుతున్న నేప‌థ్యంలో ఆవేడి ఇప్పుడు ఏపీకి తాకింది. అందుకే పలు పార్టీకి చెందిన నాయ‌కులు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఏ నియోజ‌క‌వ‌ర్గం అయితే సేఫ్ గా ఉంటుందో ఆ నియోజ‌క‌వర్గం వైపు మ‌కాం మార్చతున్నారు.
 
వీరితోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇదేబాట ప‌ట్టార‌ట‌. గంత‌లో అత్య‌ధిక మెజార్టీతో గెలిచిన వీరు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తే ఖ‌చ్చింగా ఓడిపోతామ‌నే ఉద్దేశంతో ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ద‌మ‌య్యార‌ట‌. అయితే ఇప్ప‌టికే వీరంద‌రు అధిష్టానం ముందు త‌మ వాద‌న‌లు కూడా వివ‌రించార‌ట‌. ఈ క్ర‌మంలో ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ నియోజ‌క‌వ‌ర్గం మార‌డంలో ముంద‌జలో ఉన్నార‌ట‌.
 
మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య‌కు రాజకీయంగా మంచి శిష్యుడుగా ఉన్న ఆమంచికి చీరాల‌లో ప్ర‌జా ధ‌ర‌ణ ఎక్కువ‌గా ఉంది. అందుకే ఆయ‌న హ్య‌ట్రిక్ విజ‌యాల‌ను కొట్టాల‌నే ఉద్దేశంతో గ‌తంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. 2009లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసిన ఆయ‌న తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత మొద‌టి సారిగా 2014లో ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో న‌వోద‌య పార్టీ స్థాపించి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ప్ర‌జాధ‌ర‌ణ అండ‌తో గెలిచారు. 
 
ఆ త‌ర్వాత ఆయ‌న టీడీపీలో చేరి మ‌రింత ప్ర‌జాధ‌ర‌ణ ద‌క్కించుకోవాల‌నుకున్నారు. అయితే ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల్లో టీడీపీ పై వ్య‌తిరేక‌త ప్ర‌భావం చూస్తుంటే త‌న కొంపముంచుతుంద‌నే ఆలోచ‌న‌లో ఆమంచి ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఇలానే టీడీపీలో కొన‌సాగితే రాజ‌కీయ‌ మ‌నుగ‌డ సాగించ‌లేమ‌నే ఉద్దేశంలో పార్టీ మారేందుకు సిద్ద‌మైన‌ట్లు జిల్లా వ్యాప్తంగా వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
అయితే ముందుగా వైసీపీలో చేరాలా లేక జ‌న‌సేన‌లో చేరాల‌నే అనే అంశం చ‌ర్చించుకుని వైసీపీలో చేరాల‌నుకున్నా ర‌ట‌. అంతేకాదు ఆయ‌న ఇటీవ‌లే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయిన‌ట్లు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ భేటిలో జ‌గ‌న్ సానుకూలంగా స్పందించ‌తో త‌ర్వ‌లో వైసీపీ తీర్థం తీసుకోనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన టీడీపీ నేత‌లు ఆమంచిని పార్టీనుంచి పోనియ్య‌కుండా తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 
 
ఇక ఆమంచి పార్టీ మారుతున్నార‌న్న విష‌యం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు చేర‌డంతో ఆయ‌న‌ను స‌చివాలయానికి పిలిపించుకుని ఆరా తీశార‌ట. అయితే ఆమంచి మాత్రం త‌న రాజ‌కీయ భ‌విష‌ష్య‌త్‌ పై ఆచితూచి అడుగు వేస్తున్నార‌ట‌. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.