వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాల‌కృష్ణ ఓట‌మి ఖాయ‌మా..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mla balakrishna
Updated:  2018-08-30 03:28:30

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాల‌కృష్ణ ఓట‌మి ఖాయ‌మా..?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనంత‌పురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. 
 
2014 ఎన్నిక‌ల్లో స‌మీప అభ్య‌ర్ధి న‌వీన్ పై 16,196ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అనంత‌రం ప‌గ్గాలు చేప‌ట్టినా నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో పాల‌న ప‌డ‌కేయ‌డంతో ప్ర‌జ‌లు ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే దీన్ని సీరియ‌స్ గా తీసుకున్న టీడీపీ అధిష్టానం వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాల‌కృష్ణ‌ను గెలిపించుకోవాల‌ని గ్రౌండ్ వ‌ర్క్ ప్రిపేర్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ గ్రౌండ్ వ‌ర్కే బాల‌కృష్ణ గెలుపుకు అడ్డం ప‌డుతుంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. 
 
నియోజ‌క‌వ‌ర్గంలో పాల‌న స్త‌బ్ధుగా ఉండ‌డం, ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో సీరియ‌స్ గా ఉన్న చంద్ర‌బాబు హిందూపుర్ లో గెలుపు గుర్రాల‌పై స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌ర్వేలో భాగంగా వైసీపీ కీల‌క నేత‌ల వివ‌రాల్ని సేక‌రించిన‌ట్లు హిందూపూర్ వైసీపీ ఇంఛార్జ్ న‌వీన్ నిశ్చ‌ల్ ఆరోప‌ణ‌లు చేశారు. గ‌త కొద్ది కాలంగా టీడీపీ నేత‌లు నియోజ‌క‌జ‌వ‌ర్గంలో ర‌హ‌స్యంగా స‌ర్వేనిర్వ‌హిస్తున్నార‌ని అన్నారు. ఓట‌మి భ‌యంతో  టీడీపీ అధిష్టానం వైసీపీ నేత‌ల వివ‌రాలు సేక‌రిస్తున్న‌ట్లు మండిప‌డ్డారు.
 
దీనికి తోడు హిందూపురం నియోజకవర్గంలో అవినీతి పేరుకుపోయిన‌ట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాకు ప్రాణపదమైన హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేయడంతో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది.   హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలకు 13 టీఎంసీల నీళ్లు అందించాల్సి ఉన్నప్పటికీ, చుక్కనీటిని కూడా ప్రభుత్వం అందించడం లేద‌నే అప‌వాదను మూట‌గ‌ట్టుకుంది. వైఎస్ హయాంలో స్వాధీనం చేసుకున్న లేపాక్షి భూములను అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు వెనక్కిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా రైతులకు భూములను వెనక్కి ఇప్పించలేదు. అంతేకాదు ఆ భూముల్లో ఇప్పటివరకు ఒక్క పరిశ్రమను కూడా రాక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు హిందూపూర్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌పై అస‌మ్మ‌తిని వ్య‌క్తం చేస్తున్నారు.  
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.