టీడీపీ MLA అభ్యర్థి అరెస్ట్ కి ఆదేశాలు చంద్రబాబు కు దిమ్మతిరిగే షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-10-11 01:43:13

టీడీపీ MLA అభ్యర్థి అరెస్ట్ కి ఆదేశాలు చంద్రబాబు కు దిమ్మతిరిగే షాక్

డిప్యూటీ సీఎం త‌న‌యుడిని వ‌చ్చే ఎన్నిక‌ల కోసం సిద్ధం చేస్తున్న స‌మ‌యంలో తాజా ప‌రిణామాలు టీడీపీ వర్గాల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. 2019లో అభ్యర్థి అయిన వ్యక్తి అరెస్ట్ కి ఆదేశాలు వచ్చాయి. ఎన్నిక‌ల ముంగిట జంట హత్య కేసులో ఇరుక్కోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా కోర్ట్ ఆదేశాలు క‌ల‌వ‌రం క‌లిగిస్తున్నాయి. దాంతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి వార‌సుడు కేఈ శ్యాంబాబు ప‌రిస్థితి సందిగ్ధంలో ప‌డుతోంది. టీడీపీ నేత శ్యాంబాబుతో పాటుగా ఎస్‌ఐ నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్‌ చేయాలంటూ డోన్‌ కోర్టు ఆదేశాలు జారీ చేయ‌డం విశేషంగా మారింది.
 
గతంలోకి వెళ్తే పత్తికొండ వైసీపీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు మలుపు తిరిగింది. 2017 మే 21న నారాయణరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ హతుడి భార్య చెరుకులపాడు శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 12 మందిపైనే కేసు నమోదుచేసి, అరెస్టు చేశారు. తాము ఫిర్యాదులో నిందితులుగా పేర్కొన్న కేఈ శ్యాంబాబు, కప్పట్రాళ్ల బొజ్జమ్మ, ఎస్‌ఐ తులసి నాగప్రసాద్‌ పేర్లు తొలగించారని పేర్కొంటూ డోన్‌ కోర్టులో ఆమె ప్రైవేటు కేసు దాఖలు చేశారు. కేసు పురోగతికి సంబంధించిన వివరాలు ఇవ్వడంలేదంటూ మరో పిటిషన్‌ వేశారు.
 
వీటిని విచారించిన జడ్జి.. హత్య కేసులో నిందితులుగా ఆ ముగ్గురి పేర్లు కూడా చేర్చాలని తీర్పు చెప్పారు. పత్తికొండ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన డ్రైవర్‌ సాంబశివుడు హత్య కేసులో వీరిని నిందితులుగా చేర్చాలంటూ దాఖ‌ల‌యిన పిటీష‌న్ లో కోర్ట్ నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. 2017లో త‌న భ‌ర్త హ‌త్య త‌ర్వాత నారాయణ రెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి డోన్‌ కోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్‌ చేయాలంటూ అప్పట్లో కోర్టు ఆదేశాలు జారీచేసింది. అనంతరం కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.
 
స్టే గడువు ముగియడంతో వారిని అరెస్ట్‌ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మ‌ళ్లీ స్టే కోసం ప్ర‌య‌త్నించే అవ‌కాశాలున్నాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. కోర్టుల్లో స్టే తెచ్చుకుంటున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న అవుతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. చివ‌ర‌కు ప‌రిణామాలు ఎటు మ‌ళ్లుతాయో చూడాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.