చింత‌మ‌నేని దౌర్జ‌న్యం వృద్ధుల‌ని చూడ‌కుండా కాళ్ల‌తో త‌న్ని దాడి చేసిన వైనం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-22 17:19:40

చింత‌మ‌నేని దౌర్జ‌న్యం వృద్ధుల‌ని చూడ‌కుండా కాళ్ల‌తో త‌న్ని దాడి చేసిన వైనం

తెలుగుదేశం పార్టీ పేద‌ల పార్టీ, తెలుగు దేశం పార్టీ బ‌డుగు బ‌ల‌హీనుల పార్టీ, నిత్యం ఎస్సీ ఎస్టీల‌కు అండ‌గా ఉండే పార్టీ తెలుగు దేశం పార్టీ అనే నినాదంతో ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తీ సాధార‌ణ‌ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తునే ఉంటారు. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ నినాదాల‌న్ని ప‌క్క‌న పెట్టి త‌మ‌కు అడ్డు వ‌చ్చిన అమాయ‌క ప్ర‌జ‌ల‌పై దాడి చేస్తున్నారు టీడీపీ నాయ‌కులు.
 
అయితే తాజాగా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ అధికార బ‌లంతో అమాయ‌క ప్ర‌జ‌ల‌పై దాడి చేశారు. సాధార‌ణంగా ఓటు వేసి గెలిపించుకున్న త‌మ నాయ‌కుడు ద‌గ్గ‌ర‌కు వెళ్తే న్యాయం జ‌రుగుతుంద‌ని భావించి స్థానిక గ్రామానికి చెందిన దివ్యాంగుడు చింతమ‌నేనిని క‌లిశారు. వారి వాద‌న‌లు విన‌కుండానే అత‌నిని చింత‌మ‌నేని కాళ్ల‌తో త‌న్ని బ‌య‌టికి పంపించారు. అడ్డువచ్చిన అతని 70ఏళ్ల వృద్ధ తల్లిని చెంపపై కొట్టడంతోపాటు, 80ఏళ్ల వృద్ధ తండ్రి రంగారావును డొక్కల్లో కాళ్లతో తన్నారు. 
 
చింత‌మ‌నేని దెబ్బ‌ల‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి అయిన త‌మ కుమారుడిని వృద్దులు క‌ష్ట‌ప‌డి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ అక్క‌డ డాక్ట‌ర్లు నిర్ల‌క్ష్యం వ‌హించి ఇత‌నికి ఏం కాలేదని చెప్పి పంపిచారు. ఇంత‌కు ఏం జ‌రిగిందంటే... దెందులూరు గ్రామం కాసీ కాలనీకి చెందిన దివ్యాంగుడు సంపంగి సింహాచలం అనే వ్య‌క్తి ఇంటిలో ఈదుపల్లి రామారావు అను వ్య‌క్తి అద్దెకు ఉంటున్నారు. 
 
అయితే ఈ ఇంటిపై రామారావుకు క‌న్ను ప‌డింది. దీంతో ఆ ఇంటిని ఎలాగైనా సొంతం చేసుకోవాల‌నే ఉద్దేశ్యంతో అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. ఇక ఈ విష‌యం తెలుసుకున్న ఆ ఇంటి ఓన‌ర్స్ పోలీసులను ఆశ్ర‌యించారు. ఈ వ్య‌వ‌హారంలో టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని జోక్యం ఉండ‌టంతో పోలీసులు అక్క‌డే తేల్చుకోమ‌న్నారు. దీంతో వారు చింత‌మ‌నేని నివాసానికి చేరుకుని త‌మ ఇంటిని అక్ర‌మంగా రామారావు ఆక్ర‌మించుకుంటున్నార‌ని చెప్ప‌కుండానే అధికార బ‌లంతో వారిపై దాడి చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.