జ‌గ‌న్ పాద‌యాత్రలో చింత‌మ‌నేని

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-14 16:59:04

జ‌గ‌న్ పాద‌యాత్రలో చింత‌మ‌నేని

ప్ర‌తిప‌క్ష‌నేత‌ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర తెలుగుదేశం పార్టీ కంచుకోట కృష్ణా జిల్లాను పూర్తి చేసుకుని ఈ రోజు ప‌శ్చి మ‌గోదావ‌రి జిల్లా దెందులూరులో నిర్విరామంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్రతో దెందులూరుకు చేరుకోవ‌డంతో వైసీపీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు అధిక సంఖ్య‌లో పాల్గొని జ‌న‌నేత జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఊహించ‌ని విధంగా వైసీపీ కార్య‌కర్తలు పాద‌యాత్ర‌లో పాల్గొన‌డంతో దెందులూరు ప్రాంతం కొద్ది సేప‌టి వ‌ర‌కూ ట్రాఫిక్ అంత‌రాయం ఏర్ప‌డింది.
 
అయితే ఈ ట్రాఫిక్ లో  దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చిక్కుకున్నారు. ఏలూరు రూరల్ మండలం లింగారావుగూడెం దగ్గర జగన్ పాదయాత్ర ఓ వైపు... అదే గ్రామంలో చర్చి ప్రారంభోత్సవానికి హాజరైన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోవైపు అయ్యారు.  ఈ క్ర‌మంలో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ త‌న కాన్వాయి నుంచి దిగి కిరాణ షాప్ లో  చాక్లేట్ల‌ను కొని అటుగా వెళ్తున్న వైసీపీ కార్య‌క‌ర్త‌లకు పంచారు.
 
అదేంటి టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు చాక్లేట్లు పంచ‌డం ఏంటి, కొంప‌తీసి ఆయ‌న వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నారా! అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. దీనికి స‌మాధానం కావాలంటే మ‌రికొద్ది రోజుల‌పాటు ఆగాల్సిందే అని విశ్లేష‌కులు భావిస్తున్నారు.
 
అయితే మ‌రోవైపు ఈ విష‌యంపై టీడీపీ నాయ‌కులు స్పందిస్తూ, జగన్ పాదయాత్ర ట్రాఫిక్‌లో చిక్కుకున్ననేప‌థ్యంలో చింతమేని సాధారణ ప్రజలకు చాక్లెట్లు పంచారని, వారితోపాటు  పాదయాత్రకు వచ్చిన వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ఆయ‌న చాక్లెట్లు ఇచ్చారని అంటున్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికి వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు చింత‌మ‌నేని చాక్లేట్లు పంచ‌డంతో వైసీపీలో జోరు మ‌రింత పెరిగింద‌నే చెప్పాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.