ఆ సెగ్మెంట్ లో పోటీ చెయ్య‌నంటే చెయ్య‌ను టీడీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-10-01 11:09:19

ఆ సెగ్మెంట్ లో పోటీ చెయ్య‌నంటే చెయ్య‌ను టీడీపీ ఎమ్మెల్యే

విశాఖప‌ట్నం జిల్లా య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఎమ్మెల్యే ర‌మేష్ బాబు 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఆయ‌న పోటీకి సిద్దం అవుతున్నారు. అయితే తాను య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చెయ్య‌న‌ని చెబుతున్నారు. వ‌చ్చె ఎన్నిక‌ల్లోసిట్టింగ్ స్థానం త‌న‌కు వ‌ద్దంటే వ‌ద్దు అని తెగేసి చెబుతున్నారు. 2009 వ‌ర‌కు ర‌మేష్ బాబు అంటే జ‌నాల‌కు పెద్ద‌గా తెలియ‌దు గుట్టుగా పోర్టులో వ్యాపారం చేసుకునే కాంట్రాక్ట‌ర్ గా అక్క‌డున్న ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే ఆయ‌న ప‌రిచ‌యం.
 
ఇక 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన ర‌మేష్ ఆ త‌ర్వాత గంటా, అవంతిల‌తో క‌లిసి టీడీపీ తీర్థం తీసుకున్నారు.ఇక  2014లో ఎన్నిక‌లు జ‌రిగితే య‌ల‌మంచిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ర‌మేష్. అయితే ఆయ‌న ఎమ్మెల్యేగా గెల‌వ‌డాని నానా తిప్ప‌లు ప‌డ్డార‌ని వార్త‌లు వ‌చ్చాయి. వాస్త‌వానికి య‌ల‌మంచిలిలో టీడీపీకి మంచి ప‌ట్టు ఉంది. అలాంటి ప‌రిస్థితిలో ర‌మేష్ క‌ష్ట‌కాలంలో గ‌ట్టేక్కారు. నాలుగు గ్రూపులుగా ఉన్న పార్టీల్లో, వాటిని అదిగ‌మించ‌డంలో ఈ నాలుగు స్థంభాలు ఒక ఆట ఆడాల్సి వ‌చ్చింది. విశాఖ‌ డైరీ చైర్మ‌న్ ఆడాల తుల‌సిరావు ఒక‌ గ్రూప్, జ‌డ్పీ చైర్మ‌న్ భ‌ర్త భాస్క‌ర్ రావుది మ‌రో గ్రూప్, కుమార్ ది మ‌రో గ్రూప్ ఇక వీల్లంద‌రిని క‌లుపుకుని 2014లో గెలిచే స‌రికి పంచ‌క‌ర్ల‌కు చుక్క‌లు క‌నిపించాయ‌న‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతుంటాయి.
 
ఇక ఆయ‌న ఎమ్మెల్యే అయిన త‌ర్వాత నుంచి ఈ నాలుగు గ్రూప్ లు తీవ్ర ఇబ్బందులు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అక్ర‌మ మైనింగ్ త‌వ్వ‌కాల్లో పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు అనుచ‌రులు చ‌ల‌రేగి పోతున్నార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌రుస ఫిర్యాదు చెయ్య‌డంతో ఆయ‌న డిఫెన్స్ లో ప‌డ‌టం అల‌వాటు అయిపోయింది. అయితే ఈ క్ర‌మంలో పంచ‌ర్లకు చెక్ పెట్టాల‌నే ప్ర‌త్య‌ర్థుల ఎత్తులు సాగ‌లేదు. దీనికి కార‌ణం ఆయ‌న‌కు మ‌చిలీ ప‌ట్నం ఎంపీ నారాయ‌ణ‌, హోం మంత్రి చిన‌రాజ‌ప్ప ఆశిస్సులు ఉండ‌ట‌మే కార‌ణం అంటారు తెలుగు త‌మ్ముళ్లు.
 
ఇక మ‌రో వైపు అదే పార్టీకి చెందిన టీడీపీ నేత విజ‌య్ కుమార్ మంత్రి అయ్య‌న్న పాత్రుడితో సంంబంధాల‌ను మేయింటేన్ చేస్తూ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ది ప‌నుల‌ను చేస్తున్నారు. ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌వ‌ర్శేష‌న్లు ఎక్కువ అయ్యాయి. దీంతో ర‌మేష్ బాబు య‌ల‌మంచిలికి గుడ్ బై చెప్పి సేఫ్ జోన్ కు వెళ్లాల‌ని భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో కాపు ఓటు బ‌లంగా ఉన్న వైజాగ్ నార్త్ కానీ, పెందుర్తి టికెట్ త‌న‌కు కేటాయించాల‌ని పంచ‌క‌ర్ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఒత్తిడి తీసుకువ‌స్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఆయ‌న కోరిక‌ను చంద్ర‌బాబు నెర వేరుస్తారా లేదా అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.