ప్ర‌శ్నించినందుకు గ‌ర్జించిన టీడీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-06 18:26:05

ప్ర‌శ్నించినందుకు గ‌ర్జించిన టీడీపీ ఎమ్మెల్యే

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓట్లు రాబ‌ట్టేందుకు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో విసృతస్థాయిలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ది కార్య‌క్ర‌మాలు ఏ విధంగా చేశారో వాట‌న్నింటిని  ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు టీడీపీ నాయ‌కులు.
 
అయితే తాజాగా టీడీపీ త‌ల‌పెట్టిన గృహ‌మ‌స్తు కార్య‌క్ర‌మానికి ఆ పార్టీ గన్నవరం ఎమ్మెల్యే నారాయణమూర్తి లంకవారిపేటకు చేరుకున్నారు. ఇక‌ ఆయ‌న త‌మ గ్రామానికి చేరుకున్నాడ‌న్న‌ విష‌యాన్ని గ్రామ‌స్థులు తెలుసుకుని హుటా హుటిన ఆయ‌న ద‌గ్గ‌ర‌కు చేరుకుని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. టీడీపీ అధికాంలోకి వచ్చిన త‌ర్వాత త‌మ గ్రామంలో ఒక్క రోడ్డును కూడా వేయ‌లేద‌ని, ఎక్క‌డి ప‌నులు అక్క‌డే ఉండిపోయాయ‌ని త‌మ‌ గ్రామానికి ఎందుకు వ‌చ్చార‌ని  మ‌హిళ‌లు ప్ర‌శ్నించారు. త‌మ పిల్లలు స్కూల్ కు వెళ్లి వ‌చ్చే లోపు దెబ్బ‌లు మీద దెబ్బ‌లు త‌గిలించుకుని వ‌స్తున్నార‌ని మండిప‌డ్డారు.
 
ఇక వారు చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ ఎమ్మెల్యే నారాయణమూర్తి స్పందించి గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఈ గ్రామం వారు ఓట్లు వేస్తే తాను గెలువ‌లేద‌ని మ‌హిళ‌ల‌పై ఫైర్ అయ్యారు. ఈ గ్రామంలో రోడ్డు వెయ్యాలంటే స‌మ‌యం ప‌డుతుంద‌ని అందుకు గ్రామ‌స్తులు స‌హ‌క‌రిచాల‌ని ఆయ‌న అన్నారు. అయితే నాలుగు సంవ‌త్స‌రాల నుంచి ఇదే మాట చెబుతూ త‌ప్పించుకుపోతున్నారని గ్రామ మ‌హిళ‌లు మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.