టీడీపీకి షాక్.. జ‌న‌సేన‌లోకి టీడీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-12 19:04:52

టీడీపీకి షాక్.. జ‌న‌సేన‌లోకి టీడీపీ ఎమ్మెల్యే

అధికార తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన‌ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలురూ న‌గ‌ర టీడీపీ ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జీకి  కార్పోరేట‌ర్ల కు మ‌ధ్య రోజు రోజుకు విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి.టీడీపీ అధికారంలోకి వ‌చ్చినప్ప‌టినుంచి ఏలూరు అభివృద్ది ప‌నుల‌లో త‌మ‌కు అందాల్సిన వాటాలు కుడా అందలేద‌ని టీడీపీ కార్పోరేట‌ర్లు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నార‌ట‌.
 
పాల‌క వ‌ర్గం ఏర్పాటు అయిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన కోట్ల రూపాయ‌ల అభివృద్ది ప‌నుల‌లో వాటాల‌ను పంచ‌క‌పోవ‌డంపై అధికార పార్టీకి చెందిన కార్పోరేట‌ర్లు భ‌హిరంగంగానే త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.  ఇటీవ‌లే ఏలూరు న‌గ‌రంలో సుమారు 2 కోట్ల రూపాయ‌లకు సంబంధిచి ప్ర‌భుత్వ అమోదం ల‌భించింది. అయితే ఈ ప‌నుల‌ను టెండ‌ర్ల ద్వారా కాకుండా వేలం పాట ద్వారా కాంట్రాక్ట‌ర్లు ప‌నుల‌ను ద‌క్కించుకున్నారు. ఇందుకు గాను క‌మీష‌న్ గా సుమారు 30 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్లు ఆరోపణ‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ క‌మీష‌న్ డ‌బ్బులను కూడా పంచ‌కుండా సొంత అవ‌స‌రాల‌కు ఎమ్మెల్యే బ‌డేటి వాడుకుంటున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
అంతేకాదు ఏలూరు తెలుగుదేశం పార్టీలో జ‌రిగిన కొన్నిప‌రిణామాలు పార్టీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. టీడీపీ త‌రుపున సిట్టింగ్ ఎమ్మెల్యే బ‌డేటికి టికెట్ రావ‌టం క‌ష్టం అని తేల‌డంతో ఆయ‌న జ‌న‌సేన వైపు చూస్తున్నారంటూ వ్య‌తిరేక వ‌ర్గం నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో ఏలూరు న‌గ‌ర క‌మిషన్ లో కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌రో నేత‌కు టీడీపీ టికెట్ వ‌స్తుందంటూ కూడా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
అయితే త‌న‌కు వ్య‌తిరేకంగా వస్తున్న పోస్టుల‌పై మాజీ డిప్యూటీ మేయ‌ర్ హ‌స్తం ఉంద‌ని ఎమ్మెల్యే బ‌డేటి భావించారట‌. దీంతో కార్పోరేష‌న్ లో కీల‌క నేత‌ల‌ను మంద‌లించ‌డ‌మే కాకుండా మాజీ డిప్యూటీ మేయ‌ర్ పై చేయ్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 
 
అంతే కాకుండా త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే సీరియ‌స్ గా ఉంటుంద‌ని ఘాటుగా హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఏ ఇత‌ర నేత‌లు క‌లిసినా ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత  ఎమ్మెల్యే కార్య‌క్ర‌మాల‌కు కార్పోరేట‌ర్లు హాజ‌రుకాకున్నార‌ట‌. దీనికితోడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ పై బ‌డేటికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క్లారీటీ ఇవ్వ‌క‌పోవ‌డాన్ని వ్య‌తిరేక వ‌ర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇక ఈ నేప‌థ్యంలో అసంతృప్తుల‌ను బుజ‌జ్జ‌గించే ప‌నిలో ప‌డ్డార‌ట బ‌డేటి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.