వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-30 11:51:09

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు ప‌డుతున్న బ్ర‌హ్మ‌ర‌థాన్నిచూసి క‌చ్చితంగా 2019 ఎన్నికల్లో వైసీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించి మెల్ల‌గా టీడీపీనాయ‌కులు పార్టీకి దూరంగా ఉంటూ ఛాన్స్ దొరికితే పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ ను క‌లుసుకుని ఆయ‌న స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ద‌మ‌య్యారు అధికార‌ నాయ‌కులు.
 
ఇక ఇప్ప‌టికే టీడీపీలో ఉన్న సీనియ‌ర్ నాయ‌కులంద‌రూ వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇదే క్ర‌మంలో ప్ర‌స్తుత టీడీపీ ఎమ్మెల్యేలు కూడా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది. అయితే ఈ వ‌రుస‌లో క‌ర్నూల్ జిల్లా బ‌న‌గాన‌ప‌ల్లెకు చెందిన బీసీ జ‌నార్థ‌న రెడ్డి ముందంజ‌లో ఉన్నారు. ఈయ‌న 2014లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసి గెలిచినా కూడా పార్టీ త‌ర‌పున చంద్ర‌బాబు ఎలాంటి గుర్తింపు ఇవ్వ‌లేదు. దీంతో బీసీ జ‌నార్థ‌న రెడ్డి, చంద్ర‌బాబుపై అసంతృప్తితో ఉన్నారు. అందుకే  చంద్ర‌బాబు నిర్వ‌హించిన మినీ మ‌హానాడు స‌భ‌ను కూడా ఈ నియోజ‌కవర్గంలో ఇంత వ‌ర‌కూ ఏర్పాటు చేయ‌లేదు. 
 
ఇక ఈ విష‌యం ముఖ్య‌మంత్రికి తెలియ‌డంతో ఆయ‌న ఆధ్వ‌ర్యంలో మినీ మ‌హానాడు స‌భ‌ను ఈ మ‌ధ్య కాలంలో నిర్వ‌హించారు. అయితే ఈ స‌భ‌కు బీసీ డుమ్మా కొట్టారు. స‌భ‌కు హాజ‌రు కాలేద‌న్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేకంగా ఆయ‌న‌కు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వ‌లేద‌ట‌. దీంతో ఆగ్ర‌హించిన‌ చంద్ర‌బాబు ఎందుకు స‌భ‌కు హాజ‌రు కాలేదు అని టీడీపీ నాయ‌కులును అడిగి తెలుసుకున్నారు. అప్పుడు అస‌లు క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌విని కేటాయిస్తాన‌ని చెప్పి బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేశార‌ట. కానీ బీసీ జ‌నార్థ‌న రెడ్డి వాటిని తోసి పుచ్చార‌ట. ఈ క్ర‌మంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తుండ‌డంతో బీసీ త‌న అనుచ‌రుల‌తో వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు.
 
ఇక ఇదే క్ర‌మంలో ఫిరాయింపు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కూడా పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారంటూ ప్ర‌కాశం జిల్లాలో జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆమంచి గెలిచిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఈయ‌న‌ అధికార పార్టీలో చేరిపోయారు. అయితే ఆయ‌న టీడీపీలో ఫిరాయించిన‌ప్ప‌టికి  చంద్ర‌బాబు పెద్ద‌గా గుర్తింపు ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న తిరిగి ఇత‌ర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ద‌మ‌య్యార‌ట‌.
 
కొద్ది రోజులుగా  ఆమంచి తెలుగుదేశం పార్టీ కార్య‌క‌లాపాల్లో పెద్ద‌గా ఉత్సాహం చూప‌డంలేదు. పైగా ఇత‌ర పార్టీ అధినేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని, టీడీపీ అధిష్టానానికి తెలిసినా కూడా ఆయ‌న‌ను బుజ్జ‌గింపు కార్య‌క్ర‌మం చేయ‌లేదు. అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో చీరాల నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసేందుకు పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఆస‌క్తి చూపుతున్నందున త‌న దారి తాను చూసుకుంటున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆమంచి కృష్ణ‌మోహ‌న్ పార్టీ మారేందుకు ఇప్ప‌టి నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని స‌మాచారం. అయితే ఆయ‌న ఏ పార్టీలో చేరుతారు అన్న విష‌యం మాత్రం క్లారిటీ లేదు. 
 
ఇక రాజ‌కీయ విశ్లేష‌కుల స‌మాచారం బ‌ట్టి చూస్తే ఎక్కువ శాతం వైసీపీలోకి చేరే అవ‌కాశం ఉంది. ఎందుకంటే 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని ఏపీలో నిర్వ‌హించిన స‌ర్వేల‌న్ని చెబుతున్నాయి సో.. క‌చ్చితంగా వైసీపీలో చేరే అవ‌శాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు తెలుపుతున్నారు. ఇక ఫిరాయింపులను జ‌గ‌న్ ప్రోత్స‌హించ‌క‌పోతే జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.