ప్ర‌త్య‌క్ష రాజకీయాల‌కు టీడీపీ ఎమ్మెల్యే గుడ్ బై

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-18 13:52:41

ప్ర‌త్య‌క్ష రాజకీయాల‌కు టీడీపీ ఎమ్మెల్యే గుడ్ బై

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న తురుణంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు సీట్ల కేటాయింపు గొడ‌వ‌లు ర‌చ్చ‌బండ‌కు ఎక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానిక ఇద్ద‌రు టీడీపీ ఇంచార్జ్ లు ఉండ‌టంతో వారిలో ఎవ‌రికి సీటు ఫిక్స్ చేయాల‌నే దానిపై అధిష్టానం కూడా త‌ల ప‌ట్టేసుకుంటుంది. ఇక మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే తాను గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గంలో కాకుండా వేరే నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తాన‌ని చెప్పి చంద్ర‌బాబు నాయుడుకు ఒత్తిడి తీసుకువ‌స్తున్నారు. 
 
అయితే ఇలాంటి సంఘ‌ట‌నే టీడీపీ కంచుకోట తూర్పు గోదావ‌రి జిల్లాలో ర‌గులుతోంది. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు నుంచి టీడీపీలో ఉంటూ వ‌చ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కంటే రాజ‌కీయంగా ఆయ‌నే సీనియ‌ర్. ఇంత‌కు ఆయ‌న ఎవ‌ర‌నుకుంటున్నారా.. రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఈయ‌న సుదీర్ఘ రాజకీయ జీవితంలో అసెంబ్లీకి 8 సార్లు పోటీ చేసి 5 సార్లు విజ‌యం సాధించారు. ఇక తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014లో ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి త‌న ప్రత్య‌ర్ధి ఆకుల వీర్రాజుపై సుమారు 18,178 ఓట్ల ఆదిక్యత‌తో గెల‌పొందారు. 
 
వాస్త‌వానికి బుచ్చ‌య్య‌కు రూర‌ల్ నుంచి పోటీ చేయ్యాల‌ని అస్సలు ఇష్టం లేదు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో రూర‌ల్ కాకుండా రాజ‌మండ్రి అర్భ‌న్ నుంచి పోటీ చెయ్యాల‌ని చూశారు. అయితే టీడీపీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ పొత్తులో భాంగంగా అర్భ‌న్ సీటు బీజేపీకి ద‌క్కింది. దీంతో బుచ్చ‌య్య రూర‌ల్ వైపు మ‌కాం వేశారు. ఇక ఇప్పుడు బీజేపీ టీడీపీకి విడాకులు ఇవ్వ‌టంతో అర్భ‌న్ సీటు పై బుచ్చ‌య్య క‌న్నేశారు. కానీ చంద్ర‌బాబుకు ఆయ‌న‌కు పొంత‌న కుద‌ర‌క‌ అర్భ‌న్ సీటును వేరేవారికి ఇచ్చేందుకు సిద్ద‌య్యారు. 
 
దీంతో చేసేది ఏమి లేక బుచ్చ‌య్య తిరిగి తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి రూరల్ నుంచే పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించుకున్నారు. అయితే ఇప్పుడున్న ప‌రిస్థిలో బుచ్చ‌య్య‌కు రూర‌ల్ సీటు కూడా క‌ష్ట‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. టీడీపీ అదికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ముఖ్య‌మంత్రికి బుచ్చ‌య్య‌కు స‌న్నిహిత సంబంధాలు లేవు తాను సీనియ‌ర్ నాయ‌కుడిని కాబ‌ట్టి మంత్రి ప‌ద‌వి కేటాయించ‌క‌పోవ‌డంతో చాలా కాలంగా అధిష్టానంపై క‌స్సుమ‌ని ఉన్నారు బుచ్చ‌య్య‌.కొన్ని సంద‌ర్భాల్లో ఏకంగా టీడీపీని ఆయారాం..గ‌యారాంల పార్టీగా మార్చేశార‌ని మండిప‌డ్డారు.
 
ఇక ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి రూర‌ల్ సీటు కూడా వేరేవారికి ఇచ్చే ఆస్కారం ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. మొత్తం మీద 2019 ఎన్నికల‌కు గోరంట్ల బుచ్చ‌య్య  ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పాల్సి వ‌స్తుందేమోన‌నే అభిప్రాయం వినిపిస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.