ఇది బికాంలో ఫిజిక్స్ ను మించిన డైలాగ్ జ‌లీల్ ఖాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-10 18:33:33

ఇది బికాంలో ఫిజిక్స్ ను మించిన డైలాగ్ జ‌లీల్ ఖాన్

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున అత్య‌ధిక మెజారిటీతో గెలిచి ఆ త‌ర్వాత అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు ప‌శ్చిమ విజ‌య‌వాడ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్. ఆ త‌ర్వాత ఆయ‌న ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ బీకాంలో ఫిజిక్స్ ఉంద‌ని  చెప్పి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చున్న సంగ‌తి తెలిసిందే. ఇక తాగాజా మ‌రోసారి మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి బికాంలో ఫిజిక్స్ త‌ల‌ద‌న్నే విధంగా మ‌రో డైలాగ్ చెప్పి జలీల్ ఖాన్ వార్త‌ల్లో నిలిచారు.
 
ఈ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై అలాగే జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌ను ఉద్దేసించి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్, క‌న్నా చ‌రిత్ర ఏంటో ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక దొంగ అని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏం చేశారో అందరికీ తెలుసిందేన‌ని పార్టీని ముంచి మంత్రిపదవి తీసుకున్న చరిత్ర మీది కాదా అని జ‌లీల్ ఖాన్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని  ప్ర‌శ్నించారు.
 
అలాగే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పోటీగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అనుమ‌తి ఇస్తే త‌న కూతురుని పోటీకి దింపుతాన‌ని వ్యాఖ్య‌లు చేశారు. 
 
ఇక ఈ వార్త‌లను చూసిన జ‌నాలు పులివెందుల‌లో వైఎస్ ఫ్యామిలీని ఓడించ‌డం చంద్ర‌బాబు నాయుడు వల్లే కాలేదు. నిన్న మొన్న బికాంలో ఫిజిక్స్ ఉంద‌ని చెప్పి ఫేమ‌స్ అయిన మీవ‌ల్ల ఏం కాద‌ని సోష‌ల్ మీడియాలో నేటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు అయితే ఇది బీకాంలో ఫిజిక్స్ కంటే అదిరిపోయే డైలాగ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.