జ‌లీల్ ఖాన్ ఇంట విషాదం సానుభూతి తెలిపిన సీఎం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jaleel khan
Updated:  2018-08-17 04:27:55

జ‌లీల్ ఖాన్ ఇంట విషాదం సానుభూతి తెలిపిన సీఎం

విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్ జ‌లీల్ ఖాన్ ఇంట నేడు విషాదం చోటు చేసుకుంది. జ‌లీల్ ఖాన్ సోద‌రుడు ష‌బ్బీర్ అహ్మ‌ద్ ఖాన్ కుమారుడు మోసిన్ ఖాన్ ఈ రోజు గుండె పోటుతో మ‌ర‌ణించారు. దీంతో జ‌లీల్ ఖాన్ కుటుంబంలో విషాదం నిండిపోయింది. 27 సంవ‌త్స‌రాలు క‌లిగిన మోసిన్ ఖాన్ విజ‌య‌వాడ ఆటోన‌గ‌ర్ లో ఐర‌న్ వ్యాపారం చేసుకునే వారు. 
 
ఆయ‌న షాప్ లో ఉండ‌గానే హార్ట్ స్ట్రోక్ రావ‌డంతో వెంట‌నే ఆయ‌న సూర్య‌పేట‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి వెళ్లి చూపించుకున్నారు. తీవ్రంగా నొప్పి ఉన్నా కూడా ఆయన వెంట‌నే త‌న తండ్రికి ఫోన్ చేసి స‌మాచారం అందించారు. ఇక ఈ స‌మ‌యంలో గుండె నొప్పి ఎక్క‌వ కావ‌డంతో ఆయ‌న అక్క‌డే మృతి చెందారు. చెట్టంత కొడుకు మృతి చెంద‌డం చూసి జ‌లీల్ ఖాన్ కుటుంబం షాక్ కు గురి అయింది. 
 
ఇక  ఈ వార్త తెలిసిన వెంట‌నే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జ‌లీల్ ఖాన్ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ‌ సానుభూతి తెలిపారు. ఆయ‌న‌తో పాటు టీడీపీ మంత్రులు ఎంపీ కేసినేని నానిల‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు  మోసిన్ ఖాన్ భౌతిక కాయాన్ని సంద‌ర్శించి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.