అడ్డ‌గోలుగా అప్పుచేసిన జ‌య‌నాగేశ్వ‌ర రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mla bv jayanageswar reddy
Updated:  2018-08-25 02:22:36

అడ్డ‌గోలుగా అప్పుచేసిన జ‌య‌నాగేశ్వ‌ర రెడ్డి

అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జ‌య‌నాగేశ్వ‌ర రెడ్డి మున్సిప‌ల్ చైర్ ప‌ర్సన్ సాయ స‌ర‌స్వ‌త్ర మ‌ధ్య‌న ప్ర‌స్తుతం ప‌చ్చ‌గ‌డ్డి వేయ‌కుండానే వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయ‌ట‌. ఈ ప‌రిస్థితి రావ‌డం కార‌ణం తెలుసుకునే ముందు ఒక సారి ఈ నాలుగేళ్ల‌లో జ‌రిగిన కొన్ని ముఖ్య‌మైన ప‌రినామాల‌ను తెలుసుకోవాల్సిందే. 
 
ఎమ్మిగ‌నూరు మున్సిపాల్టీ చైర్ ప‌ర్స‌న్ పాయ స‌ర‌స్వ‌తి 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ అభ్య‌ర్థిగా భ‌రిలోక దిగిన జ‌య‌నాగేశ్వ‌రరెడ్డి గెలుపుకోసం ఆమె బాగానే శ్ర‌మించారు. అంతేకాదు పెద్ద మొత్తంలో డ‌బ్బులు కూడా జ‌య‌నాగేశ్వ‌ర రెడ్డికి అప్పుగా ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఒక ప‌క్క అడ్డు అదుపులేని హామీలు, మ‌రో ప‌క్క ధ‌న ప్ర‌వాహం ఇలా ప‌లు కార‌ణాల‌తో ఎమ్మెల్యేగా గెలిచిన జ‌య‌నాగేశ్వ‌ర రెడ్డి ఈ నాలుగేళ్ల‌లో రెండు చేతులారా సంపాదిస్తున్నార‌ని ప్ర‌జ‌లు చెప్ప‌కుంటున్నారు. 
 
నీవు బాగానే సంపాదిస్తున్నావు క‌దా నా అప్పు నాకు ఇచ్చెయ్ అని చైర్ ప‌ర్స‌న్ స‌ర‌స్వ‌తి ఎమ్మెల్యేను ప‌లుమార్లు అడిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆ అప్పుడు విష‌య‌మే గుర్తుకు రాన‌ట్లుగా ఎమ్మెల్యే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలుగుదేశం పార్టీ నాయ‌కులు భ‌హిరంగాంగానే మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ప‌లువురు కౌన్సుల‌ర్ల‌ను చైర్ ప‌ర్సన్ స‌ర‌స్వ‌తికి దూర‌మయ్యేలా చేసి త‌న‌వైపు తిప్పుకున్నార‌ని, ప్ర‌తీ విష‌యంలోనూ  ఆమె మాట‌కు చెల్లుబాటు కాకుండా చేస్తున్నార‌ని ఎమ్మెల్యే పై విమ‌ర్శ‌లు వెళ్లువేత్తుతున్నాయి. 
 
అటు తీసుకున్న అప్పు ఇవ్వ‌డు ఇటు తానేమైనా నాలుగు రాళ్లు వెన‌క్కి వేసుకుందామంటే కౌన్సిల‌ర్ల ద్వారా ఆప‌ని చేయ‌నీయ‌కున్నార‌ని స‌ర‌స్వ‌తి త‌న అనుచ‌రుల ద‌గ్గ‌ర వాపోతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌తీ అభివృద్ది ప‌నిలోన ఎమ్మెల్యే జ‌య‌నాగేశ్వ‌ర రెడ్డినే క‌మీష‌న్లు తీసుకుంటూ త‌న‌కంటూ ఏవీ మిగిల్చ‌కుండా ఎమ్మెల్యే వ్య‌వ‌హ‌రించ‌డంపైన స‌ర‌స్వ‌తి ప్ర‌స్తుతం తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. 
 
ఇక ఈ నేపథ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌ర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న ద‌గ్గ‌రే అన్ని విష‌యాలు తేల్చుకోవ‌డానికి స‌ర‌స్వ‌తి ఆమె అనుచ‌రులు సిద్ద‌మైన‌ట్లు టీడీపీ వ‌ర్తాల‌నుంచి అందుతున్న స‌మాచారం. అయితే గ‌తంలో ఇలాంటి పంచాయితీలు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తీ అవినీతి ప‌నిలోను చెరిస‌గం పంచుకుని పాలు నీళ్ల‌ల్లా క‌లుసుకునిపార్టీ కోసం కృషి చేయ్యాల‌ని సీఎం చంద్రబాబు స‌ల‌హా ఇచ్చిన‌ట్లుగానే ఎమ్మిగ‌నూరు త‌గాదాలోను స‌ల‌హా ఇస్తార‌ని స‌ర‌స్వ‌తి వ‌ర్గీయులు ఆశ‌గా ఉన్నారు. ఇక ఇదంతా చూస్తున్న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఇదేమి పాల‌న రా బాబు అని ఉడికి పోతున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.