ఎమ్మెల్యేగా పోటీ చెయ్య‌ను జేసీ ప్ర‌భాక‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-13 18:30:42

ఎమ్మెల్యేగా పోటీ చెయ్య‌ను జేసీ ప్ర‌భాక‌ర్

హోరా హోరీగా జ‌రుగ‌బోయే సార్వ‌త్రిక ఎన్నికల‌కు ఇటు అధికార తెలుగుదేశం పార్టీ పార్టీ నాయ‌కులు అటు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు స‌మ‌రానికి స‌ర్వం సిద్దం చేసుకుంటున్నారు. అంతేకాదు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్పయాత్ర‌లో భాగంగా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్ధుల‌ను కూడా నియ‌మిస్తున్నారు. 
 
ఇక అధికార తెలుగుదేశం పార్టీ విష‌యానికి వ‌స్తే త‌న‌తో పాటు త‌న కుమారుల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వాల‌ని ఒత్తిడి తీసుకువ‌స్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. చంద్ర‌బాబు సీటు ఇవ్వ‌లేని ప‌క్షంలో అవ‌స‌రం అయితే త‌మ‌ సీటు కూడా కొడుకుల‌కు ఇచ్చేందుకు సిద్ద‌మ‌య్యారు టీడీపీ నాయ‌కులు. అయితే ఇందులో మంత్రి ప‌రిటాల సునిత త‌న కుమారుడికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేసే సీటును ఇచ్చేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. 
 
ఇక ఇదే క్ర‌మంలో మ‌రో ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా త‌న సీటు త్యాగం చేసేందుకు సిద్ద‌య్యారు. ఆయన ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చెయ్య‌న‌ని త&