గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే....వైసీపీలోకి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-06 13:36:31

గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే....వైసీపీలోకి

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నిక‌లకు కేవ‌లం ప‌దినెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌టంతో టీడీపీ అధిష్టానం తమ‌కు సీటు కేటాయిస్తుందో లేదో అన్న అనుమానంతో టీడీపీ నాయ‌కులు సైకిల్ వీడి ఫ్యాన్ చెంత‌కు చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. 
 
ఇక మ‌రికొంద‌రు అయితే జ‌గ‌న్ త‌మ‌కు వ‌చ్చే ఎన్నిల్లో సీటు ఇవ్వ‌క‌పోయినా ప‌ర్వాలేదు పార్టీలోకి ఆహ్వానిస్తే చాలని  టీడీపీ నాయ‌కులు భావిస్తున్నారు. అయితే ఇప్ప‌టికి టీడీపీలో ఉన్న సీనియ‌ర్ నాయ‌కులంతా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఇక‌ ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు కూడా ఇదే బాట‌లోనే ప‌డ్డారు. 
 
అయితే ఈ క్ర‌మంలో క‌ర్నూల్ జిల్లా బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌కవ‌ర్గానికి చెందిన బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈయ‌న కొద్ది కాలంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై అసంతృప్తితో ఉన్నారు. అందుకే రీసెంట్ గా ఏర్పాటు చేసిన ముఖ్య‌మంత్రి స‌భ‌కు కూడా హాజ‌రు కాలేదు. దీంతో ఆయ‌న వైసీపీలోకి చేరుతార‌ని టీడీపీ నాయ‌కులు ఫిక్స్ అయ్యారు.
 
అయితే ఇదే క్ర‌మంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కూడా వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌నే వార్త‌ అమ‌రావ‌తిలో పెద్ద చ‌ర్చ‌గా మారుతోంది. ఈయ‌న గ‌తంలో ఎంపీగా, అలాగే 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచారు. మోదుగుల‌ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎప్పుడూ వైసీపీ పైనే ధ్యాసంతా.... ఈ ధ్యాసతోనే టీడీపీకి బైయ్ చెప్పి వైసీపీలోకి వెళ్తార‌నే వార్త‌లు గ‌తంలో వ‌చ్చాయి. అయితే ఈ విష‌యంపై మోదుగుల స్పందించ‌లేదు. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో స‌హా అంద‌రూ వైసీపీలోకి చేరుతార‌నే ఊహించారు కానీ ఆయ‌న చేర‌లేదు.
 
ఇక ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో క‌చ్చితంగా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌నే ముఖ్య‌మంత్రి అవుతార‌ని మోదుగుల త‌న అనుచ‌రుల‌తో చ‌ర్చిస్తున్నార‌ట‌. అంతే కాదు ఈ పాద‌యాత్ర‌ను నిత్యం త‌న నివాసంలో సాక్షి ఛాన‌ల్ పెట్టుకుని జ‌గ‌న్ స్పీచ్ క‌చ్చితంగా చూస్తార‌ట‌. దీంతో టీడీపీ నాయ‌కులకు ఏం చేయాలో దిక్కుతోచ‌డంలేద‌ట‌. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను టీడీపీ అధిష్టానం ఎన్నో సార్లు బుజ్జ‌గించే కార్య‌క్ర‌మాలు చేసింది. కానీ ఫ‌లితం మాత్రం ద‌క్క‌లేదు. దీంతో రానున్న రోజుల్లో క‌చ్చితంగా మోదుగుల వైసీపీలో చేరుతార‌ని అధికార నాయ‌కులు భావిస్తున్నారు.
 
ఒక వేళ‌ ఆయ‌న వైసీపీలో చేరితే ఆయనకు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలనే దానిపై కూడా జగన్ ఆలోచిస్తున్నార‌ట‌. అయితే ఇటీవ‌లే  మోదుగుల బాహాటంగా మాట్లాడుతూ తాను మాచర్ల నుంచైనా పోటీ చేయడానికైనా సిద్ధమేనని, ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.