నీ అంతు చూస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-27 15:02:04

నీ అంతు చూస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే ఫైర్

2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌ట్టి నుంచి టీడీపీ నాయ‌కులు అధికార బ‌లంతో విచ్చ‌ల‌విడిగా అవినీతి అక్ర‌మాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వీరంగం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వీరంగంలో అడ్డు వ‌చ్చిన వారిని మీ అంతుచూస్తామంటు బెందిరింపుల‌కు కూడా దిగుతున్నారు.
 
అయితే ఇదే క్ర‌మంలో మ‌రోసారి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తిరుప‌తి ఎయిర్ పోర్ట్ లో త‌న వీరంగం సృష్టించారు. చిత్తూరు జాయింట్ క‌లెక్ట‌ర్ గిరిషా పై,  బొల్లినేని అంద‌రూ చూస్తుండ‌గానే చిందులు తొక్కారు. 
 
మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ్, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి తిరుప‌తికి రాక సంద‌ర్భంగా ప్రోటోకాల్ విష‌యంలో జాయింట్ క‌లెక్ట‌ర్ పై ఇష్టం వ‌చ్చినట్లు రామారావు మాట్లాడారు. అంతేకాదు గిరిషాను నీ అంతు చూస్తాను, నాకు ప్రోటోకాల్ క‌ల్పించ‌కుండా వెళ్లావా అని బొల్లినేని దుర్బాష‌లాడారు. 
 
ఇక ఈ వ్య‌వ‌హారంపై ఇద్ద‌రికి స‌ర్ధిచెప్ప‌బోయిన రేణిగుంట త‌హ‌శీల్దార్ పై కూడా రామారావు త‌న నోటికి ఏ మాట వ‌స్తే ఆ మాట‌తో బూతులు తిట్టారు. తాను ఈ విషయంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి చెప్పి మీ అంతు చూస్తాన‌ని బొల్లినేని రామారావు త‌మ‌ను బెదించార‌ని త‌హ‌శీల్దార్ న‌ర‌సింహులు నాయుడు చెబుతున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.