పవన్‌పై పోటీచేస్తా టీడీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-17 12:10:40

పవన్‌పై పోటీచేస్తా టీడీపీ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన విమ‌ర్శ‌లను టీడీపీ  నాయ‌కులు తీవ్రంగా ఖండిస్తున్నారు... తాజాగా అనంత‌పురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీ చేతులో కీలుబోమ్మ అయ్యార‌న్న విష‌యాన్నిమూడు నెలల క్రితమే చెప్పానని ఆయ‌న‌ తెలిపారు. జనసేన‌ వెనుక బీజేపీ ఉందనే విషయాన్ని వామపక్ష పార్టీలు  గుర్తించ‌లేక‌పోతున్నాయ‌ని అన్నారు... ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రానికి సీఎం చంద్ర‌బాబు త‌ర్వాత  తానే ప్రత్యామ్నాయమని పవన్ భావిస్తున్నారని, అందుకే టీడీపీ పై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అన్నారు.
 
అనంత‌పురం అసెంబ్లీ నుంచి పవన్‌ కల్యాణ్‌ మీపైనే పోటీకి రాబోతున్నారంటూ ప్రభాకర్‌ వద్ద విలేఖ‌రులు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ అనంతపురం నుంచి పవన్‌ తనపై పోటీకి వస్తానంటే స్వాగతిస్తానన్నారు. అంతేకాకుండా ఆయనపై పోటీ చేసి తన సత్తా ఏంటో చూపిస్తానని ప్రభాకర్‌ చౌదరి తెలిపారు.  అయితే ఇక్క‌డ వైసీపీ కూడా బ‌లంగా ఎదుగుతోంది..
 
ఇక ప‌వ‌న్ ముందుగానే చెప్పిన‌ట్లు అనంత‌పురం జిల్లా నుంచి ఏదో ఓ సెగ్మెంట్ నుంచి పోటీ చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ని కూడా చ‌ర్చించుకుంటున్నారు.. ఎక్కువ‌గా అనంత‌పురం సెగ్మెంట్ లేదా క‌దిరి లేదా గుంత‌క‌ల్లు నుంచి ప‌వ‌న్ పోటీ చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ని జ‌న‌సేన కూడా చర్చించుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.