బిగ్ వికెట్ డౌన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-04 19:00:45

బిగ్ వికెట్ డౌన్

రాను రాను తెలుగుదేశం పార్టీ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకొని సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇత‌ర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు... ఇక ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే... ఇక అదే స్థాయిలో తెలంగాణ‌లో కుడా అర‌కొర‌ ఉన్న‌ టీడీపీ నాయ‌కులు కూడా సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఇత‌ర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.
 
అయితే గ‌తంలో టీ- టీడీపీ త‌ర‌పున బాధ్య‌త‌లు వ్య‌వ‌హ‌రించిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి రాహుల్ గాంధీ సమ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సంగ‌తి తెలిసిందే.. ఇక తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బీసీ సంఘాల ఉద్య‌మ నేత‌ ఆర్. కృష్ణ‌య్య కూడా పార్టీ వీడే ఆలోన‌లో ఉన్న‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి... దీనికి ముఖ్య‌కార‌ణం టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఏపీలో బీసీల పై వ్య‌వ‌హ‌రిస్తున్న విధానం స‌రిగ్గా లేద‌నే కార‌ణంతో ఆయ‌న పార్టీ మారేందుకు సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది.
 
2014 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తే బీసీ నాయ‌కుడు కృష్ణ‌య్య‌ను ముఖ్య‌మంత్రి చేస్తాన‌ని  చంద్ర‌బాబు చెప్పారు....కానీ ఎన్నిక‌ల త‌ర్వ‌త కృష్ణ‌య్య‌ను చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు.. దీంతో ఆయ‌న ఎక్క‌డ‌ పార్టీ మీటింగ్ లు జ‌రిగినా కానీ, టీడీపీ కండువా క‌ప్పుకోకుండా కేవ‌లం బీసీ కండువా క‌ప్పుకుంటూ కృష్ణ‌య్య వ‌చ్చారు.
 
ఈ నేప‌థ్యంలో ఆయ‌న టీడీపీకి గుడ్ బై చెప్పి సొంతంగా పార్టీని నిర్మిస్తార‌ని కొంద‌రు అంటుంటే.. మ‌రి కొంద‌రు ఆయన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీజేఎస్ ఏదో పార్టీల్లో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని అంటున్నారు.. మొత్తానికి ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణ‌లో కూడా టీడీపీ వ‌ల‌స‌లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.