బినామీ పేర్ల‌తో టీడీపీ ఎమ్మెల్యే అవినీతి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-08-18 01:17:51

బినామీ పేర్ల‌తో టీడీపీ ఎమ్మెల్యే అవినీతి

పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య నుంచి కాకాని వెంక‌ట‌ర‌త్నం వ‌రకు ప‌లువురు పేరు పొందిన జ‌న హృద‌య నేత‌లు ప్రాతినిత్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గం కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం. పార్టీల‌కు సంబంధం లేకుండా ప్ర‌జ‌లకు అందుబాటులో ఉంటార‌నే న‌మ్మ‌కం ఉంటే చాలు స్వ‌తంత్య్ర అభ్య‌ర్థుల‌ను కూడా గెలిపించారు ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు.
 
గ‌న్నవ‌రం నియోజ‌క‌ర్గంలో మొత్తం ఓటర్లు 2 ల‌క్ష‌ల 26వేల 769 మంది ఉన్నారు. నియోజ‌కవ‌ర్గంలో గ‌న్నవ‌రంలో బాపుల‌పాడు గ‌న్న‌వ‌రం విజ‌య‌వాడ రూర‌ల్ మండ‌లంలోని తొమ్మిది గ్రామాలు క‌లిసి ఉన్నాయి. ఇక 2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌ర‌పున పోటీ చేసిన వ‌ల్ల‌భ‌నేని వంశీ త‌న స‌మీప వైఎస్సార్ కంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి దుట్టా రామ‌చంద్ర‌రావుపై 9వేల 548 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
 
ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ అభ్య‌ర్థిగా వ‌ల్లభ‌నేని వంశీ మోహ‌న్ అనేక హామీల‌ను ఇచ్చారు. కానీ వాటిని అమ‌లు చేయ‌డంలో వంశీ పూర్తిగా విఫ‌లం అయ్యార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అంతేకాదు గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో జ‌రిగిన వివిధ భూ సేక‌ర‌ణ‌ల్లో అవ‌క‌త‌వ‌క‌ల కార‌ణంగా పెద్ద ఎత్తున చేతులు మారింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయితే ఇదంతా ఎమ్మెల్యే క‌నుస‌న్నల్లోనే జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు త‌న‌కు అనుకూలంగా లేని గ్రామాల్లో పెద్దఎత్తున భూసేక‌ర‌ణ జ‌రిపించార‌ని ప‌రిహారానికి న్యాయం కూడా ద‌క్క‌కుండా వంశీ అడ్డుకున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
 
గ‌న్నవ‌రం నియోజ‌క‌వర్గ ప‌రిధిలో మొత్తం 17 భూసేక‌ర‌ణ నోటిఫికేష‌న్లు వెల‌బ‌డ్డాయి. భూసేక‌ర‌ణ ద్వారా దాదాపు 5వేల ఎక‌రాలు తీసుకునేందుకు ప్ర‌ణాళిక‌ను సిద్దం చేశారు. అయితే కొన్నింటి విష‌యాలో రైతులు నుంచి తీవ్ర‌మైన నిర‌స‌న‌లు రావ‌డంతో కొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాదు గ్రామాల్లో జ‌న్మభూమి క‌మిటీల ద్వారా ప్ర‌తిప‌క్షం వారికి సంక్షేమాలు అందివ్వ‌కుండా గ్రామాల‌లో  చెరువులను నీరు చెట్టుకింద ఇష్టారాజ్యంగా త‌వ్వుకోవ‌డం చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో బినామీ పేర్లు పెట్టి నిధుల‌ను ఎమ్మెల్యే వంశీ స్వాహా చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.